యాప్నగరం

Lavanya Tripathi: మొత్తానికి కంప్లీట్ చేసిన అందాల రాక్షసి.. ఇక సందీప్ కిషన్‌కి బై బై

సందీప్ కిషన్- లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా లావణ్య పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది.

Samayam Telugu 13 Nov 2020, 8:39 pm
తన లేటెస్ట్ మూవీ ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ కోసం ఆశ్చర్యపర్చేలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు యంగ్ హీరో సందీప్ కిషన్. గతంలో ఎన్నడూ చూడని లుక్‌లో ఆయన కనిపించనున్నారు. ఇక ఈ మూవీలో సందీప్ సరసన అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఆడిపాడింది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తికావడంతో సందీప్ కిషన్‌కి బై బై చెప్పేసింది లావణ్య.
Samayam Telugu మొత్తానికి పూర్తి చేసిన అందాల రాక్షసి..
Lavanya Tripathi Sandeep Kishan


పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, వెంకటాద్రి టాకీస్‌ పతాకాలపై హాకీ నేపథ్యంలో రూపొందుతున్న ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ మూవీలో సందీప్ కిషన్- లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రంలో ఇద్దరూ కూడా హాకీ ప్లేయర్స్‌గా కనిపించనుండటం విశేషం. హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్ర‌మిది. లాక్‌డౌన్ కంటే ముందే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రానికి 'డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను' ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 'హిప్ హాప్ త‌మిళ' సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు.

Also Read: Samantha: యూ నాటీ అంటూ సమంతపై విజయ్ దేవరకొండ కామెంట్.. విదేశాల్లో రౌడీ స్టార్ హగ్! సీక్రెట్స్ రివీల్..

''ఎ1 ఎక్స్‌ప్రెస్ మూవీలో సందీప్ కిషన్‌తో పనిచేయడం చాలా సరదాగా అనిపించింది. ఈ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌తో ఫుల్లుగా ఎంజాయ్ చేశా'' అని గతంలోనే పేర్కొంది లావణ్య త్రిపాఠి. మరోవైపు సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్ లుక్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. హాకీ మ్యాచ్ మీదే క్లైమాక్స్ అంతా నడుస్తుందని తెలుస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. అతిత్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు మేకర్స్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.