యాప్నగరం

రవితేజ 'టచ్ చేసి చూడు' నుంచి హీరోయిన్ వాకౌట్

మాస్ మహారాజ రవితేజ హీరోగా ఈమధ్యే సెట్స్‌పైకి వెళ్లిన టచ్ చేసి చూడు మూవీకి ఇంకా పూర్తిస్థాయిలో షూటింగ్...

TNN 10 Feb 2017, 12:15 pm
మాస్ మహారాజ రవితేజ హీరోగా ఈమధ్యే సెట్స్‌పైకి వెళ్లిన టచ్ చేసి చూడు మూవీకి ఇంకా పూర్తిస్థాయిలో షూటింగ్ ప్రారంభం కాకముందే హీరోయిన్ రూపంలో ఓ ఇబ్బంది ఎదురైంది. ఈ సినిమాలో నటించాల్సి వున్న లావణ్యా త్రిపాఠి తనకి డేట్స్ సర్దుబాటు కావడం లేదనే కారణంతో సినిమాలోంచి పక్కకు తప్పుకుంది. విక్రమ్ సిరికొండ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ప్రముఖ కథా రచయిత వక్కంతం వంశీ స్టోరీ అందించాడు.
Samayam Telugu lavanya tripathi walked out of ravi tejas upcoming flick touch chesi chudu
రవితేజ 'టచ్ చేసి చూడు' నుంచి హీరోయిన్ వాకౌట్


ఈ సినిమాలో స్క్రిప్ట్ ప్రకారం రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించాల్సి వుంది. అందులో ఒకరు లావణ్యా త్రిపాఠి కాగా మరొకరు రాశీ ఖన్నా. కానీ ఈ ఇద్దరిలోంచి లావణ్య వాకౌట్ చేయడంతో ఇప్పుడు మరో హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు యూనిట్ సభ్యులు.

నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ కంపోజర్ ప్రీతమ్ మ్యూజిక్ అందించనున్నారని తెలుస్తోంది. అదే కానీ నిజమైతే ప్రీతమ్‌కి ఇదే మొదటి తెలుగు సినిమా అవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.