యాప్నగరం

ఎన్టీఆర్ బయోపిక్‌లో కైకాల.. సర్‌ప్రైజ్ లుక్ ఇదిగో

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘ఎన్టీఆర్’. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న యన్.టి.ఆర్ బయోపిక్ మొదటి షెడ్యూల్ మంగళవారం నాటితో పూర్తవ్వగా..

Samayam Telugu 25 Jul 2018, 8:48 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘ఎన్టీఆర్’. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న యన్.టి.ఆర్ బయోపిక్ మొదటి షెడ్యూల్ మంగళవారం నాటితో పూర్తవ్వగా.. ఈ చిత్రంలో నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రఖ్యాత చిత్ర నిర్మాత, తెలుగు సినిమా పితామహుడు అయిన హెచ్.ఎం.రెడ్డి పాత్రను పోషిస్తున్నారు కైకాల.
Samayam Telugu NTR Biopic


తన నటనతో వందలాది చిత్రాల్లోని పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన కైకాల సత్యనారాయణ యన్.టి.ఆర్ బయోపిక్‌లో హెచ్.ఎం.రెడ్డిగా అద్భుత నటనతో అలరించనున్నారు. ఆ మహానుభావుడి పాత్రను ఈ మహానటుడు అమోఘమైన పద్ధతిలో రంజింపజేశారని దర్శకుడు క్రిష్ తెలిపారు. కైకాల సత్యనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నేడు ఈ సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు క్రిష్.
ఎన్.బి.కె స్టూడియోస్ పతాకంపై నందమూరి బాలకృష్ణ నిర్మిస్తూ టైటిల్ రోల్ పోషిస్తుండడం మరో విశేషం. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని సాయికొర్రపాటి, విష్ణు ఇందూరు సమర్పిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నరేష్ వి.కె, మురళీశర్మ, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.