యాప్నగరం

రణబీర్ కపూర్ గర్ల్ ఫ్రెండ్ ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా?

రణబీర్ కపూర్ గర్ల్ ఫ్రెండ్ గా అతన్ని కాదని మరొకరని పెళ్లి చేసుకుంది. ఏంటి ఎంతమంది రణబీర్ కు హ్యాండ్ ఇస్తారని అనుకోకండి. ఈ వార్త చదివితే మీకే తెలుస్తుంది.

TNN 31 Oct 2016, 3:53 pm
రణబీర్ కపూర్ గర్ల్ ఫ్రెండ్ అతన్ని కాదని మరొకరని పెళ్లి చేసుకుంది. ఏంటి ఎంతమంది రణబీర్ కు హ్యాండ్ ఇస్తారని అనుకోకండి. ఈ వార్త చదివితే మీకే తెలుస్తుంది. రణబీర్ సరసన సినిమాలో గాళ్ ఫ్రెండ్ గా నటించిన అమ్మడి పెళ్లి గురించి ఇదంతా. పాకిస్తాన్ లో పుట్టిన బ్రిటన్ వ్యాపారవేత్త డినో లల్వానితో ఏడాది కాలంగా డేటింగ్ చేస్తోన్న హాట్ బ్యూటీ లిసా హేడన్ అతన్ని పెళ్లిచేసుకుంది. ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో లీసా రణబీర్ కపూర్ గర్ల్ ఫ్రెండ్ గా నటించింది. కామెడీ టైమింగ్ అండ్ పంచ్ డైలాగ్ లో తో ఈ అమ్మడు అందులో అదరగొట్టేసింది. అందరూ ఆ యాక్ట్ ను ఎంజాయ్ చేస్తున్న వేళ సడన్ గా ఈ అమ్మడు ముఝే కో షాదీ హోగయా అని చెప్పడం కాస్త షాకింగే. చెన్నయ్ లో పుట్టి ఫారిన్ లో పెరిగిన లిసా తెలుగులో రామ్ చరణ్ రచ్చ సినిమా టైటిల్ సాంగులో నటించింది. దీంతో మనకు కూడా ఈమె సుపరిచితమే. ఈ హాట్ ముద్దుగుమ్మ డినోను పెళ్లి చేసుకుంటున్నట్లు నెలకిందట తన ఇన్ స్టా గ్రామ్ లోనూ పోస్ట్ చేసింది. మొత్తానికి ఒక బీచ్ సాక్షిగా క్రిస్టియన్ పద్ధతిలో అతనితో ఈ ముద్దుగుమ్మ పెళ్లి జరిగిపోయింది. తన స్నేహితురాళ్లు ఆమెకు బ్రయిడ్ మెయిడ్స్ కాగా.. దగ్గర బంధువులు అందరూ అటెండ్ అయ్యారు. తన మ్యారేజ్ ఫోటోలన్నీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ హాట్ భామ.
Samayam Telugu lisa haydon gets married to beau dino lalvani and the pics are beautiful
రణబీర్ కపూర్ గర్ల్ ఫ్రెండ్ ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా?


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.