యాప్నగరం

'మహానుభావుడు' ఫస్ట్‌లుక్, టీజర్ రిలీజ్ డేట్

శతమానం భవతి సినిమాతో హిట్ కొట్టిన శర్వానంద్ ఆ తర్వాత మారుతి డైరెక్షన్‌లో 'మహానుభావుడు' అనే సినిమాతో...

TNN 18 Aug 2017, 3:43 pm
శతమానం భవతి సినిమాతో హిట్ కొట్టిన శర్వానంద్ ఆ తర్వాత మారుతి డైరెక్షన్‌లో 'మహానుభావుడు' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మహానుభావుడు సినిమా ఫస్ట్‌లుక్, టీజర్ విడుదలకి ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఒక పాట మినహా సినిమా మొత్తం షూటింగ్ జరుపుకుంది ఈ సినిమా. ఈ నేపథ్యంలోనే ఈనెల 24వ తేదీన ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేసేందుకు రెడీ అయ్యాడు డైరెక్టర్ మారుతి. దసరా సీజన్‌లోనే తమ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు నిర్మాతలు ప్రమోద్, వంశీ తెలిపారు.
Samayam Telugu mahanubhavudu first look to release on 24th august
'మహానుభావుడు' ఫస్ట్‌లుక్, టీజర్ రిలీజ్ డేట్


తాజాగా మీడియాకు ఈ డీటేల్స్ వెల్లడించిన డైరెక్టర్ మారుతి.. భలే భలే మగాడివోయ్ సినిమా పూర్తి కాగానే శర్వానంద్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాసుకున్నట్టు చెప్పాడు. నిన్నటినుంచే ఈ సినిమా డబ్బింగ్ మొదలుపెట్టినట్టు తెలిపాడు మారుతి. భలే భలే మగాడివోయి, బాబు బంగారం లాంటి చిత్రాల తర్వాత మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.