యాప్నగరం

ఆస్కార్ సాధించిన తొలి ముస్లిం నటుడు

‘మూన్‌లైట్’ సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డును అందుకున్న మహెర్షలా అలీ చరిత్ర సృష్టించాడు.

TNN 27 Feb 2017, 9:19 am
‘మూన్‌లైట్’ సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డును అందుకున్న మహెర్షలా అలీ చరిత్ర సృష్టించాడు. అకాడమీ అవార్డు అందుకున్న తొలి ముస్లిం నటుడిగా అలీ నిలిచాడు. అవార్డు అందుకున్న అనంతరం ఉద్వేగభరితంగా మాట్లాడిన అలీ ఓ క్షణంలో కంటతడి పెట్టుకున్నాడు. అయితే ఉత్తమ సహాయ నటుడి విభాగంలో ‘లియన్’ సినిమా నుంచి నామినేట్ అయిన భారత నటుడు దేవ్‌పటేల్‌కు నిరాశ తప్పలేదు. ‘లియన్’లో కనబరిచిన నటకు గాను బ్రిటిష్ అకాడమీ అవార్డును అందుకున్న దేవ్‌పటేల్.. ఆస్కార్ అవార్డుల్లో మాత్రం అలీని దాటలేకపోయాడు.
Samayam Telugu mahershala ali is the first muslim actor to win an oscar ever
ఆస్కార్ సాధించిన తొలి ముస్లిం నటుడు


అవార్డు అందుకున్న అనంతరం వేదికపై మహెర్షలా అలీ మాట్లాడుతూ.. తను జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి సహకరించిన టీచర్లు, ప్రొఫెసర్లకు ధన్యవాదాలు తెలిపాడు. అలాగే ‘మూన్‌లైట్’ దర్శకుడు బారీ జెంకిన్స్‌తో పాటు ఇతర నటులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. యునైటెడ్ స్టేట్స్‌లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ఆక్లాండ్‌లో జన్మించిన అలీ.. తొలుత టీవీ సిరీస్‌ల ద్వారా కెరీర్‌ను ప్రారంభించాడు. సైన్స్ ఫిక్షన్ సిరీస్ ‘ది 4400’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరవాత సినిమాల్లోకి అడుగుపెట్టాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.