యాప్నగరం

శంకర్‌పల్లికి మహేష్.. హైదరాబాద్‌కి ప్రభాస్

‘సాహో’ మూవీతో ప్రభాస్.. ‘భరత్ అనే నేను’ మూవీతో మహేష్ బిజీగా ఉన్నారు. బాహుబలి చిత్రంతో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన ప్రభాస్.. సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నారు.

TNN 8 Jan 2018, 10:44 pm
‘సాహో’ మూవీతో ప్రభాస్.. ‘భరత్ అనే నేను’ మూవీతో మహేష్ బిజీగా ఉన్నారు. బాహుబలి చిత్రంతో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన ప్రభాస్.. సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ చిత్రం తరువాత మహేష్ ‘భరత్ అనే నేను’ మూవీ చిత్రంలో నటిస్తుండంతో అటు ‘సాహో’, ఇటు ‘భరత్ అనే నేను’ చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయ.
Samayam Telugu mahesh and prabhas upcoming movies updates
శంకర్‌పల్లికి మహేష్.. హైదరాబాద్‌కి ప్రభాస్


కాగా ఈ రెండు చిత్రాల షూటింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే.. మహేష్ బాబు ఇటీవల హాలిడే ట్రిప్‌ను పూర్తి చేసి తిరిగి ‘భరత్ అనే నేను’ మూవీ షూటింగ్ హాజరయ్యాడు. హైదరాబాద్‌లోని శంకర్‌పల్లిలో ఈ మూవీ కొత్త షెడ్యూల్ సోమవారం ప్రారంభంకాగా ఈ షూటింగ్‌కి మహేష్‌తో పాటు హీరోయన్ కైరా అద్వానీ కూడా హాజరయ్యారు.

మరోవైపు ప్రభాస్ ‘సాహో’ షూటింగ్ విషయానికి వస్తే... ఇటీవల యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణకు దుబాయ్ పయనమైన ‘సాహో’ యూనిట్.. ఆ షెడ్యూల్‌ని వాయిదా చేసుకుని హైదరాబాద్‌ నగర శివార్లలో వేసిన సెట్‌లో షూటింగ్ జరపనున్నారు. రేపటి నుండి ప్రారంభం కానున్న ఈ కొత్త షెడ్యూల్‌లో హీరో ప్రభాస్‌తో పాటు హీరోయిన్ శ్రద్దాకపూర్ కూడా జాయిన్ కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.