యాప్నగరం

Daang Daang పాటతో మహేష్, మిల్కీ బ్యూటీ ఇరగేశారు

సూపర్ స్టార్ మహేష్ బాబు.. మిల్కీ బ్యూటీ తమన్నాతో కలిసి డేంగ్.. డేంగ్ అంటూ పిచ్చెక్కించే స్టెప్పులతో రచ్చ చేస్తున్నారు. మహేష్ బాబు పొంగల్ మూవీ ‘సరిలేరే నీకెవ్వరు’ చిత్రం నుండి మరో మాస్ మసాలా సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

Samayam Telugu 28 Dec 2019, 11:31 pm
డేంగ్.. డేంగ్ అంటూ పార్టీ సాంగ్‌తో రచ్చ చేస్తున్నారు మహేష్ బాబు, తమన్నాలు. సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ‘సరిలేరు నీకెవవ్వరు’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్‌లో నటించింది. ఈ సాంగ్‌కి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది చిత్ర యూనిట్.
Samayam Telugu Daang Daang Video Song
సరిలేరు నీకెవ్వరూ


డేంగ్.. డేంగ్ అంటూ సాగిన ఈ పాటలో తమన్నా ఎప్పటిలాగే స్టెప్పులతో పిచ్చెక్కిస్తుండగా.. మహేష్ బాబు సైతం స్టెప్పులేశాడు. దేవిశ్రీ ప్రసాద్ అదిరే బీట్ ఇవ్వగా.. రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. నకాష్ అజీజ్, లావిటొ లోబొ ఆలపించిన ఈ పాట కొద్దిసేపటి క్రితం విడుదలై యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. సాయంత్రం 7 గంటలనుండి ఈ పాట ప్రోమో కోసం నిరీక్షించి నీరసించిన ఫ్యాన్స్‌కి మంచి ఊపునిచ్చే పాటను ఇచ్చి జోష్ నింపాడు దేవి శ్రీ.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్‌లో స్వింగ్ జరా మిల్కీ బ్యూటీ తమన్నాతో పోటీ పడి స్టెప్పులు వేశారు మహేష్. మొత్తంగా మహేష్ బాబుపై డాన్స్‌ సరిగా వేయలేడనే కంప్లైంట్ ఉండనే ఉంది.. అయితే ఈ సాంగ్‌తో మహేష్ దాన్ని చెరిపేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనిపించారు. మరి మహేష్, మిల్కీ బ్యూటీ ఆట పాటలపై మీరూ ఓ లుక్కేయండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.