యాప్నగరం

మహేష్ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కేదెప్పుడో!!

ప్రిన్స్ మహేష్ బాబు ‘స్పైడర్’ మూవీ తరువాత కొరటాల శివ డైరెక్షన్‌లో ‘భరత్ అనే నేను’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

TNN 18 Oct 2017, 2:23 pm
ప్రిన్స్ మహేష్ బాబు ‘స్పైడర్’ మూవీ తరువాత కొరటాల శివ డైరెక్షన్‌లో ‘భరత్ అనే నేను’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వరుసగా హ్యాట్రిక్ హిట్‌లు సాధించిన కొరటాల.. మహేష్‌కు శ్రీమంతుడు మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ ఇవ్వడంతో వీరి కాంబోలో తెరకెక్కుతున్న మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్లు ఈ మూవీలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తుండటంతో తమ అభిమాన నటుడ్ని భరత్ అనే నేను మూవీలో సీఎం కుర్చీలో చూసేందుకు ఫ్యాన్స్ ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.
Samayam Telugu mahesh babu bharat ane nenu movie release date fixed
మహేష్ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కేదెప్పుడో!!


ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో కీలక సన్నివేశాలను చిత్రీకరించే పనిలో బిజీగా ఉన్నాడు దర్శకుడు కొరటాల. కాగా ‘స్పైడర్’ మూవీతో ఈ చిత్ర షూటింగ్ ఆలస్యంగా అయ్యింది. దీంతో ముందుగా అనుకున్న షెడ్యూల్డ్ ప్రకారం వచ్చే జనవరి సంక్రాంతి కానుకగా ఈ మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే అదే సమయానికి రామ్ చరణ్ రంగస్థలం విడుదలకు రెడీగా ఉండటంతో పాటు బాలయ్య, అల్లు అర్జున్ కొత్త చిత్రాలు కూడా సంక్రాంతి బరిలోకి నిలుస్తున్నాయి. దీంతో మహేష్ భరత్ అనే నేను మూవీని సోలోగా వేసవిలో ఏప్రిల్ 20న విడదల చేసేందుకు కొత్త ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. కాగా ఈ కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. డి.వి.వి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ బ్యూటీ కైరా అడ్వాణీ మహేష్‌తో జోడీకట్టనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.