యాప్నగరం

‘భరత్ అనే నేను’ ప్రి రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ?

మహేష్-కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న ‘భరత్ అనే నేను’ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది.

TNN 10 Mar 2018, 9:07 pm
మహేష్-కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న ‘భరత్ అనే నేను’ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది. ఇప్పటికే టీజర్‌తో సోషల్ మీడియా సంచలనంగా మారిన ‘భరత్ అనే నేను’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు గ్రాండ్‌గా ప్లాన్ చేస్తుంది. ఫస్ట్ వోథ్‌లోనే అద్భుతమైన మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీ సాంగ్స్‌కి అంతకు మించిన రీతిలో స్వరాలను సమకూర్చే పనిలో ఉన్నారు. కాగా ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ మొదటి వారంలో వైజాగ్‌లో నిర్వహించి... అక్కడే సాంగ్స్‌ను కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్.
Samayam Telugu mahesh babu bharat ane nenu pre release event updates
‘భరత్ అనే నేను’ ప్రి రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ?


కొరటాల-మహేష్-దేవి శ్రీ కాంబినేషన్‌లో గతంలో విడుదలైన ‘శ్రీమంతుడు’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో ‘భరత్ అనే నేను’ మూవీపై విపరీతమైన అంచనాలు వచ్చేశాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ జోడి కడుతుండగా.. ప్రకాష్ రాజ్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీలో తమిళ సీనియర్ హీరో శరత్ కుమర్ మహేష్‌కు తండ్రిగా నటిస్తున్నారు. ఈ మూవీలో మహేష్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.