యాప్నగరం

వైరల్: బూమ్.. బూమ్‌ సాంగ్‌తో మహేష్ డాటర్ షేక్

ప్రిన్స్ మహేష్ బాబు గారాలపట్టీ సితార సోషల్ మీడియాలో మళ్లీ మెరిసింది.

TNN 7 Aug 2017, 6:50 pm
ప్రిన్స్ మహేష్ బాబు గారాలపట్టీ సితార సోషల్ మీడియాలో మళ్లీ మెరిసింది. ఈ ముద్దులొలికే చిన్నారి చేసే అల్లరి అంతాఇంతా కాదు. తన ముద్దుల తనయ చేసే అల్లరికి ప్రిన్స్ మహేష్ బాబు మురిసిపోతూ ఆ సరదా వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన అభిమానులను అలరిస్తూ ఉంటారు. తాజాగా మహేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్పైడర్ చిత్రంలోని బూం బూం సాంగ్‌ని కారులో వెళ్తూ రిపీట్ మోడ్‌లో పాడి ఆశ్చర్యపరిచింది సితార. ఇటీవల విడుదలైన ఈ సాంగ్‌కు ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్‌రాగా..ఆ పాటకు మరింత ప్రత్యేకత తీసుకువచ్చింది సితార.
Samayam Telugu mahesh babu daughter sitara singing boom boom song
వైరల్: బూమ్.. బూమ్‌ సాంగ్‌తో మహేష్ డాటర్ షేక్


She keeps listening to it on repeat mode :) her favourite new song 😊😊😊😊😊😊😊 pic.twitter.com/QTKu1pVVO9 — Mahesh Babu (@urstrulyMahesh) August 6, 2017
'తను ఈ పాటను రిపీట్ మోడ్‌లో వింటూనే ఉంది. ఇదే తన కొత్త ఫేవరెట్ సాంగ్' అని కామెంట్ చేస్తూ ఈ వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు మహేష్. ప్రస్తుతం సితార బూం బూం సాంగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల మహేష్ నటిస్తున్న స్పైడర్ మూవీ సెట్‌లో సందడి చేసిన సితార గతంలోనూ తన డాన్స్‌తో ప్రిన్స్ ఫ్యాన్స్‌ని ఫిదా చేసేసింది. అంతే కాకుండా బ్రమ్మోత్సవం సినిమాలో సమంత చెప్పిన డైలాగ్‌ను సితార.. సమంత కంటే బాగా చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో తన చిట్టిపొట్టి మాటలు, పాటలతో అలరిస్తున్న మహేష్ ముద్దుల కూతురు సితార వెండి తెరపై అల్లరి చేసేది ఎప్పుడా అని మహేష్ ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.