యాప్నగరం

మరో కొత్త బిజినెస్‌లోకి మహేష్ బాబు ?

తన కెరీర్‌లో అధిక శాతం నటనకే పరిమితమైన సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటిసారిగా శ్రీమంతుడు సినిమాతో....

Samayam Telugu 11 Apr 2017, 6:16 pm
తన కెరీర్‌లో అధిక శాతం నటనకే పరిమితమైన సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటిసారిగా శ్రీమంతుడు సినిమాతో నిర్మాతగా మారి సినిమాల్లో పెట్టుబడిపెట్టారు. స్టార్ హీరో అదృష్టం కొద్దీ, మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టి అటు హీరోగా, ఇటు నిర్మాతగా సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత తాజాగా మహేష్ బాబు మరో కొత్త బిజినెస్‌లోకి అడుగు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఫిలిం నగర్ లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం మహేష్ బాబు థియేటర్స్ బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయినట్టు సమాచారం.
Samayam Telugu mahesh babu entering in to new business
మరో కొత్త బిజినెస్‌లోకి మహేష్ బాబు ?


ఏషియన్ థియేటర్స్‌కి చెందిన సునీల్ నారంగ్‌తో మహేష్ బాబు చర్చలు జరుపుతున్నట్టుగా సినీవర్గాల్లో ఓ ప్రచారం జరుగుతోంది. మొదటి దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 25 థియేటర్స్ ఏర్పాటు చేయాలని మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నారనేది ఆ ప్రచారం సారాంశం.

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఆయన తన 23వ చిత్రం షూటింగ్‌తో బిజీగా వున్నారు. ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ రేపు ఏప్రిల్ 12న రిలీజ్ కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.