యాప్నగరం

హే.. మహేషా!! చలపతి వ్యాఖ్యలతో సమంత దొరికేసిందే

ఇటీవల 'రా రండోయ్ వేడుక చూద్దాం' ఈవెంట్‌లో చలపతిరావు చేసిన అనాలోచిత వ్యాఖ్యలు టాలీవుడ్ మెడకు చుట్టుకున్నాయి.

TNN 24 May 2017, 5:40 pm
ఇటీవల 'రా రండోయ్ వేడుక చూద్దాం' ఈవెంట్ లో చలపతిరావు చేసిన అనాలోచిత వ్యాఖ్యలను చాలా మంది ఖండించారు. ఈ వివాదం ఎక్కడ వరకు వెళ్ళిందంటే ఇప్పుడు సినిమాలో ఆ డైలాగ్ ఉంచాలా..? లేక తీసేయాలా..? అనే వరకు వచ్చింది. ఈ విషయం గురించి చిత్రబృందం ఇంత సీరియస్‌గా ఆలోచిస్తుందంటే చలపతి బాబాయ్ ఎఫెక్ట్ ఎంత స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు.
Samayam Telugu mahesh babu fans fire on samantha silence over chalapathi rao comments on woman
హే.. మహేషా!! చలపతి వ్యాఖ్యలతో సమంత దొరికేసిందే


అయితే అటు ఇటు తిరిగి ఇప్పుడు ఈ విషయం సమంత మెడకి చుట్టుకుంది. మరీ ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ సమంతను ఓ రేంజ్‌లో నిలదీస్తున్నారు. 'వన్ నేనొక్కడినే' సినిమా పోస్టర్ విషయంలో ఘాటుగా స్పందించిన సమంత బాగా సీరియస్ అయింది. నిజానికి పోస్టర్‌లో ఆమె సీరియస్ అయ్యేంత విషయం లేకపోయినా.. సమంత మాత్రం వైల్డ్‌గా రియాక్ట్ అయింది.

దీంతో ఆమె ఎప్పుడు దొరుకుతుందా...? అని మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూశారు. చలపతిరావు పుణ్యమా అని ఇప్పుడు సమంత బాగా బుక్కైంది. చలపతి చేసిన కామెంట్స్ పట్ల టాలీవుడ్ మొత్తం ఘాటుగా స్పందించింది. కానీ సమంత మాత్రం రియాక్ట్ అవ్వలేదు. ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అంటూ చైతు చెప్పిన డైలాగ్ నాకోసం కాదని అభిమానులతో సరదాగా షేర్ చేసుకున్న సమంతకి ఆ డైలాగ్ ను వక్రీకరిస్తూ.. చలపతి చేసిన కామెంట్స్ వినిపించలేదా..? అంటూ మహేష్ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.

సినిమాలో హీరో తనకు కాబోయే భర్త అనా.. లేక మామగారు నిర్మించిన సినిమా అని ఆమె రియాక్ట్ కాకుండా ఉందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ మాటలకు సమంత దగ్గర సమాధానం ఉందో.. లేదో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.