యాప్నగరం

మహేష్ కొత్త లుక్!

సూపర్ స్టార్ మహేష్ బాబు గడ్డంతో ఉన్న ఒక కొత్త లుక్ బయటికి వచ్చింది.

TNN 9 Jan 2017, 5:46 pm
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండో షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఒక్క స్టిల్ కానీ ఫోటో కానీ బయటకు రాలేదు. ఈ సినిమాకు సంబంధించిన ఒక్క విషయం కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడుతోంది చిత్రబృందం.
Samayam Telugu mahesh babu new look for murugadoss movie
మహేష్ కొత్త లుక్!


అయితే తాజాగా మహేష్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. గడ్డంతో అసలు ఇతను మహేషేనా..? అన్నట్లుగా ఉన్నాడు ఈ ఫోటోలో. సినిమాలో మహేష్ గెటప్పుల్లో ఇదొకటి అంటూ ఇప్పుడు ఈ ఫోటో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ బాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసి ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కానీ అదే నెలలో ‘బాహుబలి 2’ రిలీజ్ ఉండడంతో మహేష్ సినిమా వెనక్కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా కనిపించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.