యాప్నగరం

'భరత్ అనే నేను' సెట్స్‌లో మహేష్ బాబు

ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న స్పైడర్ మూవీ టాకీ పార్ట్ షూటింగ్ ముగియడంతో మహేష్ బాబు

Hindustan Times 22 Jun 2017, 4:50 pm
ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న స్పైడర్ మూవీ టాకీ పార్ట్ షూటింగ్ ముగియడంతో మహేష్ బాబు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వెంటనే తన తర్వాతి సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ వంటి హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు చీఫ్ మినిష్టర్ పాత్ర పోషిస్తున్నారు. మహేష్ బాబుకి తండ్రి పాత్రలో తమిళ నటుడు శరత్ కుమార్ నటిస్తున్నారు.
Samayam Telugu mahesh babu starts shooting for bharath ane nenu
'భరత్ అనే నేను' సెట్స్‌లో మహేష్ బాబు


మహేష్ బాబు సరసన ఎం.ఎస్. ధోనీ బయోపిక్ ఫేమ్ కియారా అద్వాని జోడీగా నటించనుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో అసెంబ్లీ భవనాన్ని పోలిన ఓ సెట్‌ని రూపొందించారు. ఇంతకుముందే ప్రారంభమైన 'భరత్ అనే నేను' ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో మహేష్ బాబుపై ఎటువంటి సన్నివేశాలు ప్లాన్ చేయలేదు. కానీ తాజాగా జరుగుతున్న షూటింగ్‌లో మహేష్ బాబు పాల్గొంటున్నట్టు సమాచారం.

ఇక 'స్పైడర్' అప్‌డేట్స్ విషయానికొస్తే, ప్రస్తుతానికి రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ అంతా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పనులపై మురుగ చాలా కేర్ తీసుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.