యాప్నగరం

ఖైదీ, శాతకర్ణిలపై మహేష్ కామెంట్స్

సంక్రాంతి సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు శుభాకాంక్షలను తెలియజేస్తూ.. సంక్రాంతి సినిమాలు ఖైదీ, శాతకర్ణిలపై లేటెస్ట్ కామెంట్స్ చేశారు.

TNN 14 Jan 2017, 5:38 pm
సంక్రాంతి సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు శుభాకాంక్షలను తెలియజేశారు. అలాగే సంక్రాంతి పండగకు సందడి చేస్తోన్న టాలీవుడ్ టాప్ మూవీస్ ‘ఖైదీ నెం.150, గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాలపై వరుస ట్వీట్లతో ప్రశంసల జల్లుకురిపించాడు.
Samayam Telugu mahesh babu tweets about satakarni and khaidi no150 movies
ఖైదీ, శాతకర్ణిలపై మహేష్ కామెంట్స్


సినిమా తీశామా... ప్రేక్షకులు చూశారా.. హిట్ అయితే సంతోషం లేదంటే మళ్లీ ఇంకో సినిమాతో కలుస్తా. అంటూ ఎప్పుడూ తన సినిమాలపైనే పెద్దగా స్పందించని మహేష్ బాబు బిజీ షూటింగ్ షెడ్యూల్‌లోనూ బాలయ్య, చిరు సినిమాలను చూడటం విశేషమనే చెప్పాలి.

ఖైదీ150,గౌతమి పుత్రి శాతకర్ణి విజయాలపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఈ రెండు సినిమాల టీములకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని, టాలీవుడ్‌లో ఖైదీ, శాతకర్ణి మూవీలు సంక్రాంతి సంబరాల వర్షం కురిపిస్తున్నాయని.. చిరంజీవి రీ ఎంట్రీకి వెల్కామ్ చెప్తూ.. ఇన్నాళ్లు మిమ్మల్ని మిస్ అయ్యాం, మీ లుక్స్ స్టైల్ అద్భుతం.. వెల్ కమ్ బ్యాక్ అంటూ, శాతకర్ణిలో బాలయ్య నటన టాలీవుడ్‌లోనే ఉత్తమమైన ప్రదర్శనగా నిలుస్తోందని, మీ విజన్‌కి హ్యాట్స్ ఆఫ్ అంటూ కొనియాడుతూ ట్వీట్ చేశారు మహేష్ బాబు.

ఈ సూపర్ స్టార్ లేటెస్ట్ ట్వీట్స్‌కు అటు మెగా ఫాన్స్‌లోనూ, ఇటు బాలయ్య ఫాన్స్‌లోనూ జోష్ వచ్చింది. అందుకే ప్రిన్స్‌ని సూపర్ స్టార్ అన్నదంటూ కామెంట్స్‌తో పాటు ఈ హీరో అప్ కమింగ్ మూవీ ఫస్ట్ లుక్‌ని కూడా ఈ సంక్రాంతికి విడుదల చేసి ఉంటే ఈ ఫెస్టివల్ అదిరిపోయేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Mee Andariki Sankranti Subhakankshalu :) pic.twitter.com/T1MiEyD00C — Mahesh Babu (@urstrulyMahesh) January 14, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.