యాప్నగరం

సినిమాల్లోకి మహేష్ బాబు మేనల్లుడు !

సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబుల ఫ్యామిలీ నుంచి ఎంతోమంది నటీనటులు ఇప్పటివరకు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

Samayam Telugu 17 Dec 2016, 5:13 am
సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబుల ఫ్యామిలీ నుంచి ఎంతోమంది నటీనటులు ఇప్పటివరకు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వీరిబాటలోనే మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ కూడా రానున్నాడని తెలుస్తోంది. గల్లా అశోక్ ఎవరో కాదు... మహేష్ బాబు సోదరిని పెళ్లి చేసుకున్న టీడీపీ ఎంపీ, పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ పెద్ద కొడుకే ఈ గల్లా అశోక్.
Samayam Telugu mahesh babus nephew galla ashok film debut
సినిమాల్లోకి మహేష్ బాబు మేనల్లుడు !


స్మార్ట్ లుక్స్‌తో హీరోకి కావాల్సిన అన్ని క్వాలిఫికేషన్స్ వున్న గల్ల అశోక్‌ని సినిమాల్లోకి లాంచ్ చేసేందుకు దాదాపుగా రంగం సిద్ధమైపోతోందని సమాచారం. తనయుడు అశోక్‌ని హీరోగా పరిచయం చేసేందుకు తండ్రి గల్లా జయదేవ్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ఇప్పటికే యాక్టింగ్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు అశోక్. ఇండస్ట్రీలో ది బెస్ట్ టెక్నీషియన్స్ తో ఈ సినిమాని నిర్మించేందుకు స్వయంగా గల్లా జయదేవ్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ఓ టాక్ వినిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.