యాప్నగరం

స్పైడర్ సినిమా షూటింగ్ అడ్డుకున్న యువ తెలంగాణ

బీబీనగర్ వద్ద వున్న నిమ్స్ ఆస్పత్రి ఆవరణలో జరుగుతున్న స్పైడర్ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

Samayam Telugu 13 May 2017, 11:54 am
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద వున్న నిమ్స్ ఆస్పత్రి ఆవరణలో జరుగుతున్న స్పైడర్ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఆస్పత్రికి సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం బీబీనగర్ నిమ్స్ ఆవరణలో ప్రస్తుతం షూటింగ్ జరుపుతోంది స్పైడర్ సినిమా యూనిట్. అయితే, ఆస్పత్రిలో మౌళిక వసతలు ఏర్పాటు చేసి, అభివృద్ధి చేయాల్సిన నిమ్స్ డైరెక్టర్.. అది పట్టించుకోకుండా ఆస్పత్రి భవనాన్ని సినిమాల షూటింగులకి ఇవ్వడం సరికాదంటూ అక్కడి స్థానిక నేత అయిన జిట్టా బాలకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం జరగాల్సి వున్న షూటింగ్‌ని అడ్డుకుంటామంటూ జిట్టా బాలకృష్ణా రెడ్డి శుక్రవారమే ఆస్పత్రి డైరెక్టర్‌ని హెచ్చరించారు.
Samayam Telugu mahesh babus spyder movie shooting halted at bibinagag nims campus
స్పైడర్ సినిమా షూటింగ్ అడ్డుకున్న యువ తెలంగాణ


ఈ హెచ్చరికలతో అప్రమత్తమైన నిమ్స్ డైరెక్టర్ ఈరోజు అక్కడ జరగాల్సి వున్న షూటింగ్‌ని రద్దు చేసుకోవాల్సిందిగా స్పైడర్ మూవీ డైరెక్టర్ ఏ.ఆర్. మురుగదాస్‌కి ఓ లేఖ రాశారు. షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ జరపడం కోసం స్పైడర్ మూవీ యూనిట్ నిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నప్పటికీ.. షూటింగ్ అడ్డుకుని తీరుతామని జిట్టా బాలకృష్ణా రెడ్డి చేసిన హెచ్చరికల నేపథ్యంలో షూటింగ్‌కి ఇచ్చిన అనుమతి రద్దు చేస్తున్నట్టుగా డైరెక్టర్ స్పష్టంచేసినట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతానికి నిమ్స్ క్యాంపస్‌లో జరగాల్సి వున్న షూటింగ్ నిలిచిపోయింది.

కేసీఆర్‌తో విభేదించి టీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటికొచ్చిన జిట్టా బాలకృష్ణా రెడ్డి 2010లో యువ తెలంగాణ పార్టీ స్థాపించారు. ఆ తర్వాత 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత తిరిగి యువ తెలంగాణ పార్టీ పేరిటే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.