యాప్నగరం

శాటిలైట్ రైట్స్‌లో మహేష్ హవా!

మహేష్ – మురగదాస్‌ల క్రేజీ కాంబినేషన్‌లో తెలుగు, తమిళ్ బాషల్లోనూ రిలీజ్ కానున్న యాక్షన్ ఎంటర్ టైనర్‌పై ప్రేక్షకుల్లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

TNN 7 Jan 2017, 3:15 pm
మహేష్ – మురగదాస్‌ల క్రేజీ కాంబినేషన్‌లో తెలుగు, తమిళ్ బాషల్లోనూ రిలీజ్ కానున్న యాక్షన్ ఎంటర్ టైనర్‌పై ప్రేక్షకుల్లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయన్నది శాటిలైట్ రైట్స్ కోసం నెలకొన్న విపరీతమైన పోటీ చెప్పకనే చెబుతోంది.
Samayam Telugu mahesh muragadoss film satilight rights sold
శాటిలైట్ రైట్స్‌లో మహేష్ హవా!


మహేష్ – మురగదాస్ చిత్రం శాటిలైట్ రైట్స్‌ని రూ. 26కోట్లకి జీటీవీ వారు దక్కించుకొన్నట్టు సమాచారం. తెలుగు, తమిళ్ శాటిలైట్ రైట్స్ కలిపి ఈ రేటు పలికిందా.. ? లేదా కేవలం శాటిలైట్ రేటుకే ఇంత పెద్ద మొత్తం పలికిందా ? అనేది క్లారిటీ రావాల్సిఉంది.

మహేష్ బాబుకు ఓవర్సీస్‌లో కూడా మంచి మార్కెట్ ఉండటంతో పాటు కోలీవుడ్‌లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగా దర్శకుడు మురగదాస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయకపోవడంపై ప్రిన్స్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. టైటిల్ విషయంలో సంభవామి, మహేష్ 23, ఏజెంట్ శివ, ఎనిమీ.. తదితర టైటిల్స్ ప్రచారంలో ఉన్నా ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.

అయితే, వారి కోరిక ఈ సంక్రాంతికి తీరే అవకాశం ఉంది. అప్పుడే ట్రైలర్‌తో పాటు టైటిల్, రిలీజ్ డేడ్‌ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రాన్ని రంజాన్‌కి లేదా సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.