యాప్నగరం

నేను ఫిక్స్ టైటిల్ ఇదే! నువ్వేమంటావ్ మురుగా-మహేష్

ఈ మధ్య కాలంలో మహేష్, మురుగదాస్‌ల సినిమాపై వినిపించినన్ని టైటిల్స్ మరో సినిమాకు వినిపించలేదు.

TNN 8 Mar 2017, 7:42 pm
ఈ మధ్య కాలంలో మహేష్, మురుగదాస్‌ల సినిమాపై వినిపించినన్ని టైటిల్స్ మరో సినిమాకు వినిపించలేదు. ఎవరికి తోచిన టైటిల్ వారు ఊహించేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేస్తున్నారు. ఈ విషయంపై మహేష్ చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది.
Samayam Telugu mahesh murugadoss movie title finally fixed
నేను ఫిక్స్ టైటిల్ ఇదే! నువ్వేమంటావ్ మురుగా-మహేష్


దీంతో ఆయన మూడు టైటిల్స్‌ను ఎంపిక చేసి ఫైనల్ డెసిషన్ మాత్రం మురుగదాస్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. అంతేకాదు వీలైనంత తొందరగా ఈ టైటిల్‌ను ప్రకటించాలని ఆలోచిస్తున్నారు. ఇంత భారీ బడ్జెట్‌తో సినిమా ప్రారంభించి ఎన్ని రోజులు అయినా ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన పోస్టర్ గానీ, టీజర్ గానీ, మహేష్ లుక్ గానీ ఏది బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఒకరకంగా చెప్పాలంటే ఇప్పటివరకు సినిమా ప్రమోషన్ మొదలుపెట్టనేలేదు. దీంతో బయ్యర్లలో సినిమా పట్ల ఆసక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశంతోనే మహేష్ టైటిల్ అయినా ఈ నెల 10న రివీల్ చేయాలని మురుగదాస్‌కు చెప్పినట్లుగా తెలుస్తోంది.

సంభవామి, కర్త టైటిల్స్ అనుకుంటున్నప్పటికీ ఎక్కువ శాతం సంభవామిని ఓకే చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో మహేష్ టైటిల్ ఏంటో తెలిసిపోనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.