యాప్నగరం

Majili: మా ఆయన గురించి నేను చెప్పాలా?: ‘మజిలీ’ ప్రీ రిలీజ్‌లో సమంత

‘మజిలీ’ అంటే మన ప్రేమను వ్యక్తపరచక ముందు లవ్ అంటే ఇలా ఉంటుంది.. లవ్ అంటే ఇలా ఉంటుంది అనుకుంటాం. కాని నిజం వేరేలా ఉంటుంది. ఒక్కో లవ్ స్టోరీ ఒక్కోలా ఉంది. అలానే ‘మజిలీ’ కథ ఓ యూనిక్ లవ్ స్టోరీ.

Samayam Telugu 1 Apr 2019, 12:21 am


‘మా ఆయన గురించి నేను చెబితే బాగోదు.. ఏప్రిల్ 5 తరువాత ‘మజిలీ’ చిత్రం చూసి మీరే చెప్తారు’ అని అన్నారు అక్కినేని సమంత. సామ్-చై జోడీగా నటించిన ‘మజిలీ’ మూవీ ఏప్రిల్ 5 న విడుదల కానుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు వెంకటేష్, నాగార్జునలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Samayam Telugu సమంత


Read Also: మజిలీ ట్రైలర్.. సిగ్గుండాలి పెళ్లం దగ్గర డబ్బులు తీసుకోవడానికి!ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘మజిలీ’ అంటే మన ప్రేమను వ్యక్తపరచక ముందు లవ్ అంటే ఇలా ఉంటుంది.. లవ్ అంటే ఇలా ఉంటుంది అనుకుంటాం. కాని నిజం వేరేలా ఉంటుంది. ఒక్కో లవ్ స్టోరీ ఒక్కోలా ఉంది. అలానే ‘మజిలీ’ కథ ఓ యూనిక్ లవ్ స్టోరీ. లవ్ అంటే బలం, లవ్ ధైర్యం.. లవ్ అంటూ బాధ్యత అని నేను నమ్ముతున్నా. ఏ మాయ చేశావే, మనం తరువాత ‘మజిలీ’ కూడా అంతే ఇంపార్టెంట్ మూవీ అవుతుందని నమ్ముతున్నా.

See Photos: ‘మజిలీ’ ప్రీ రిలీజ్ వేడుక

అందుకే ఈ చిత్ర దర్శకుడు శివ నిర్వాణకి మనస్పూర్తిగా థాంక్స్ చెప్పాలి. పెళ్లి అయిన తరువాత నేను అనుకున్నాను.. ఈ ప్రేమ గురించి ఎందుకు సినిమాల్లో చూపించరు అనుకున్నా. ఆ సందర్భంలో శివ ఈ కథ చెప్పారు. మా ఆయన గురించి నేను చెప్పుకుంటే బాగోదు.. కాని ఏప్రిల్ 5 తరువాత మీరు చూసి చెప్తారు. అది విని సంతోషపడతా.. ఖచ్చితంగా ‘మజిలీ’ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది’ అని అన్నారు సమంత.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.