యాప్నగరం

మలయాళ న‌టుడు అజిత్ క‌న్నుమూత..!

మలయాళ సీనియర్ న‌టుడు కొల్లాం అజిత్ (56) క‌న్నుమూశాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పది రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. అయితే గురువారం (ఏప్రిల్ 5) ఆరోగ్యం మరింతగా విషమించి, తుదిశ్వాస విడిచారు.

TNN 5 Apr 2018, 2:57 pm
మలయాళ సీనియర్ న‌టుడు కొల్లాం అజిత్ (56) క‌న్నుమూశాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పది రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. అయితే గురువారం (ఏప్రిల్ 5) ఆరోగ్యం మరింతగా విషమించి, తుదిశ్వాస విడిచారు. దాదాపు 30 ఏళ్లపాటు సాగిన ఆయన సినీప్రస్థానంలో.. 500లకు పైగా చిత్రాల్లో నటించారు. మలయాళంలోనే కాక... తమిళ, హిందీ చిత్రాల్లోనూ ఆయన నటించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో 'విలన్'గా అజిత్ గుర్తింపు పొందారు. ప్రతినాయకుడిగా ఆయన చేసిన పాత్రలకు విశేష ఆదరణ లభించింది.
Samayam Telugu Ajit


1984లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'పరాను పరాను పరాను' ద్వారా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన, 1987లో మోహన్‌లాల్ హీరోగా నటించిన 'ఇరుపతామ్ నూత్తాండు' సినిమాలో మొదటిసారిగా విలన్‌గా నటించారు. అక్కడితో ప్రారంభమైన సినీప్రయాణం... 500 చిత్రాల వరకు సాగింది. అజిత్ మృతిపై పలువురు మాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు. అజిత్ అంత్యక్రియలను రేపు కొల్లాంలో నిర్వహించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.