యాప్నగరం

వ్యభిచారంకేసులో ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్

మలయాళీ టీవీ సీరియల్ హీరోయిన్ ‘అమల రోజ్ కురియన్’ను కేరళలో వ్యభిచారం చేస్తుండగా పోలీస్‌‌లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేసారనే వార్తలు మీడియాలో రావటంతో అమల హాట్ టాపిక్ అయ్యింది.

TNN 8 Nov 2016, 4:29 pm
కొన్నిరోజులక్రితం ఓ మలయాళీ హీరోయిన్ వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుపడింది అన్న వార్త సోషల్ మీడియాలో గుప్పుమంది. మలయాళీ టీవీ సీరియల్ హీరోయిన్ ‘అమల రోజ్ కురియన్’ను కేరళలో వ్యభిచారం చేస్తుండగా పోలీస్‌‌లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేసారనే వార్తలు మీడియాలో రావటంతో అమల హాట్ టాపిక్ అయ్యింది. అయితే అప్పటినుండి మౌనం వహించిన అమల సోషల్ మీడియాలో వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై తీవ్రంగా స్పందించింది. అసలు పోలీసులకు పట్టుబడింది నేను కాదంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చింది.
Samayam Telugu malayalam actress amala rose kurian requests not to misunderstand
వ్యభిచారంకేసులో ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్


‘నాపై అనవసరవార్తలను ప్రచారం చేస్తున్నారు. పోలీసులు ఎవర్నో పట్టుకుంటే అది నేనే అన్నట్లు వార్తలు రాస్తున్నారు. ఇలాంటి వార్తలు ప్రచారంచేసే వారు ఆపకపోతే నా ఆత్మహత్య వార్తను కూడా రాయాల్సిఉంటుందని అమలా రోజ్ కురియన్ తీవ్రంగా స్పందించింది. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన నాపై అసత్య ప్రచారం చేస్తున్నారని, తనకు నటన అంటే ఆసక్తి అని అందుకే ఈ రంగంలో కొనసాగుతున్నా అంది. ఇలాంటి వార్తలవల్ల మా కుటుంబం కూడా అబాసుపాలౌతుందని కనీసం ఫోన్ ఎత్తాలన్నా భయం భయంగానే ఉందని ఎవరు ఏ ప్రశ్నవేస్తారని భయంతోనే గడుపుతున్నానని, ఈ రూమర్స్ వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నా అంటూ ఫేస్ బుక్ ద్వారా వివరణ ఇచ్చింది అమల రోజ్ కురియన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.