యాప్నగరం

రకుల్ ప్రీత్ పెళ్లి.. బాయ్ ఫ్రెండ్ అంటూ బాంబ్ పేల్చిన మంచు లక్ష్మీ

రానా హోస్ట్ చేసే నెంబర్ వన్ యారీ మూడో సీజన్‌లో మంచు లక్ష్మీ, రకుల్ రచ్చ చేశారు. రకుల్ నీ పెళ్లి ఎప్పుడు? అని రానా అడగడంతో మంచు లక్ష్మీ వెంటనే స్పందించారు. అలా రకుల్ పెళ్లి వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Samayam Telugu 7 May 2021, 8:41 pm

ప్రధానాంశాలు:

  • రానా షోలో రకుల్ ప్రీత్, మంచు లక్ష్మీ
  • రకుల్ ప్రీత్, మంచు లక్ష్మీ రచ్చ
  • రకుల్ పెళ్లిపై మంచు లక్ష్మీ కామెంట్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ​రకుల్ ప్రీత్ పెళ్లి.. బాయ్ ఫ్రెండ్ అంటూ బాంబ్ పేల్చిన మంచు లక్ష్మీ​
Manchu Lakshmi About Rakul Preet Marriage
మంచు లక్ష్మీ రకుల్ ప్రీత్ స్నేహం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తుంటాయి. ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి నెటిజన్లు సెటైర్లు వేస్తుంటారు. రొమాంటిక్‌గా ఉంటూ, సన్నిహితంగా ఉండే ఫోటోలు నెట్టింట్లోఎక్కువగా వైరల్ అవుతుంటాయి. వీటిపై మంచు లక్ష్మీ, రకుల్ తాజాగా స్పందించారు. రానా హోస్ట్ చేసే నెంబర్ వన్ యారీ మూడో సీజన్‌లో మంచు లక్ష్మీ, రకుల్ రచ్చ చేశారు.
పోలీసులకు కష్టం కానీ కరోనాకు కాదు.. చోటా రాజన్‌పై కస్తూరి శంకర్ సెటైర్లు
తమపై వచ్చే వార్తలు, గాసిప్స్ ఏంటి అని రకుల్, మంచు లక్ష్మీలను రానా అడిగితే వింత సమాధానాలు చెప్పేశారు. తమ మీద ఎన్నో రకాల వార్తలు వస్తుంటాయని, తమ మధ్య ఏదో ఉందని అంటుంటారు.. చాలా చెత్తగా రాస్తుంటారు.. మాట్లాడుతుంటారని రకుల్ చెప్పుకొచ్చారు. ఇద్దరం క్లోజ్‌గా ఉన్న ఫోటోలపై ఏవేవో రాస్తుంటారని రకుల్ చెప్పుకొచ్చారు.
ఆ డైలాగ్ గుర్తుకు వచ్చేలా.. బాలయ్య హీరోయినా మజాకా?.. కదిలించే పోస్ట్!
మంచు లక్ష్మీ జీవితంలోకి రకుల్ ఎంట్రీ ఇచ్చాక అన్ని పద్దతులు మారిపోయాయని రానా అన్నారు. తినే తిండి విషయంలో పూర్తిగా మారిపోయారని రానా అన్నారు. ఏది తినాలన్నా కూడా మంచు లక్ష్మీ ఎంతో ఆలోచిస్తోందని రానా అన్నారు. ఎక్కడికైనా వెళ్లినా కూడా రకులే ఆర్డర్ చేస్తుంటుందని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు. ఇక ఇదే క్రమంలో రకుల్ పెళ్లి గురించి రానా కామెంట్ చేశారు.
రకుల్ నీ పెళ్లి ఎప్పుడు? అని రానా అడగడంతో మంచు లక్ష్మీ వెంటనే స్పందించారు. ఈ ఏడాదిలోనే రకుల్ పెళ్లి ఉంటుందని అసలు విషయం చెప్పేశారు. కాదు కాదు అంటూ రకుల్ వారించగా.. పెళ్లి కాకపోతే ఆ ప్రయత్నాలైనా జరుగుతాయ్.. బాయ్ ఫ్రెండ్ వస్తాడేమో అని మంచు లక్ష్మీ అన్నారు. వచ్చే బాయ్ ఫ్రెండ్ ఎవరో నా దగ్గరికి వస్తే రకుల్ గురించి మొత్తం చెప్పి పంపిస్తానని మంచు లక్ష్మీ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.