యాప్నగరం

Manchu Lakshmi : డోంట్ ఫ** అంటూ మంచు లక్ష్మీ హల్చల్.. మూడ్ గురించి చెబుతూ రచ్చ

మంచు లక్ష్మీ ప్రస్తుతం ఓటీటీ, సోషల్ మీడియా ఇలా అన్ని చోట్లా దుమ్ములేపుతున్నారు. ఆహా భోజనంబు అంటూ ప్రతీ వారం టాలీవుడ్ సెలెబ్రిటీలతో స్పెషల్ వంటకాలను ప్రిపేర్ చేయిస్తున్నారు.

Samayam Telugu 26 Aug 2021, 4:22 pm

ప్రధానాంశాలు:

  • సోషల్ మీడియాలో మంచు లక్ష్మీ హల్చల్
  • హీరోయిన్లతో ఫుల్ బిజీగా మారిన నటి
  • వర్కవుట్లపై మంచు లక్ష్మీ కామెంట్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu డోంట్ ఫ** అంటూ మంచు లక్ష్మీ హల్చల్.. మూడ్ గురించి చెబుతూ రచ్చ
Manchu Lakshmi
మంచు లక్ష్మీ ప్రస్తుతం ఓటీటీ, సోషల్ మీడియా ఇలా అన్ని చోట్లా దుమ్ములేపుతున్నారు. ఆహా భోజనంబు అంటూ ప్రతీ వారం టాలీవుడ్ సెలెబ్రిటీలతో స్పెషల్ వంటకాలను ప్రిపేర్ చేయిస్తున్నారు. చివరగా ఆనంద్ దేవరకొండ, శాన్వీలు వచ్చి గుత్తి వంకాయను వండారు. అలానే తమ పుష్పక విమానం సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. ఇక మంచు లక్ష్మీ వారితో చేసిన అల్లరి కూడా అందరినీ ఆకట్టుకుంది. ఆ షోలో రకుల్ గురించి, తమ తిండి అలవాట్ల గురించి మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు.
తాను ఎంత తిన్నా కూడా అంతే స్థాయిలో వర్కవుట్లు చేస్తానని చెప్పుకొచ్చారు. మామూలుగా అయితే తినడం కోసమే వర్కవుట్లు చేస్తుంటానని ఫన్నీగా చెబుతుంటారు. అయితే నిన్న మంచు లక్ష్మీ ఫుల్లుగా లాగించేసినట్టు కనిపిస్తోంది. ప్రగ్యా జైస్వాల్‌తో కలిసి మంచు లక్ష్మీ నిన్న రెస్టారెంట్‌కు వెళ్లినట్టు కనిపిస్తోంది. ఫుడ్ గురించి మాట్లాడుతూ అక్కడ కూడా రకుల్ టాపిక్ తీశారు మంచు లక్ష్మీ.

అయితే నిన్న అంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేసిన మంచు లక్ష్మీ నేడు కాస్త ఆలస్యంగా నిద్ర లేచినట్టున్నారు. ఇక వ్యాయామం చేయాలనే ఇంట్రెస్ట్, మూడ్ కూడా లేనట్టుంది. దీంతో తన మూడ్ గురించి చెబుతూ దారుణమైన కామెంట్ చేసింది. డోంట్ ఫక్ విత్ మీ అంటూ తన స్టైల్లో తన మూడ్ గురించి, వర్కవుట్లు చేస్తున్న తీరు గురించి మంచు లక్ష్మీ వివరించారు. వచ్చే వారం ఆహా అనిపించేందుకు డియర్ మేఘా టీంతో మంచు లక్ష్మీ రెడీ అయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.