యాప్నగరం

బంగారం లాంటి నా బ్రదర్.. మనోజ్ ట్వీట్‌కు చరణ్ ఫ్యాన్స్ ఫిదా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును పురష్కరించుకుని మంచు మనోజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

Samayam Telugu 27 Mar 2019, 2:16 pm
హీరో మంచు మనోజ్ తన తోటి నటీనటుల విషయంలో ఎంతో సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుంటారు. ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మనోజ్.. ఏ హీరో కొత్త సినిమా వస్తున్నా పాజిటివ్‌గా స్పందిస్తుంటారు. ఏ హీరోహీరోయిన్‌ పుట్టినరోజు వచ్చినా శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు. మొత్తం మీద తన పాజిటివ్ యాటిట్యూడ్‌తో అందరి నుంచి ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. ఇప్పుడు రామ్ చరణ్ అభిమానుల నుంచి మనోజ్ ప్రశంసలు అందుకుంటున్నారు. దీనికి కారణం తమ హీరో పుట్టునరోజునాడు మనోజ్ కాస్త వైవిధ్యంగా శుభాకాంక్షలు తెలియజేయడమే.
Samayam Telugu Manoj


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును పురష్కరించుకుని మంచు మనోజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. రామ్ చరణ్‌ను ఆలింగనం చేసుకున్న ఫొటో, ఆయన చేతిలో చేయేసి స్నేహాన్ని చాటే ఫొటోను ఈ ట్వీట్‌లో పొందుపరిచారు. అయితే రామ్ చరణ్ ముఖాన్ని మాత్రం చూపించలేదు. అంతేకాకుండా RRR అని రాసి ఉన్న నలుపు రంగు టోపీని మనోజ్ పెట్టుకున్నారు.

‘బంగారం లాంటి నా బ్రదర్ రామ్ చరణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీకెప్పుడూ ప్రేమానురాగాలు, ఆనందంతో కూడిన బ్లాక్ బస్టర్ జీవితం చేకూరాలని కోరుకుంటున్నాను’ అని తన ట్వీట్‌లో మనోజ్ పేర్కొన్నారు. మనోజ్ ట్వీట్‌కు చరణ్ ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. చరణ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పినందుకు ఆయన ఫ్యాన్స్ మనోజ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇంతకీ ఈ ఫొటోలు ఎప్పుడు తీసుకున్నవో మాత్రం మనోజ్ చెప్పలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.