యాప్నగరం

కూతురి ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్.. మంచు విష్ణు ఫన్నీ ట్వీట్

తన కూతురి బర్త్ డే డిమాండ్‌ను ట్వీట్ చేసిన మంచు విష్ణు.. ఇది ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌కు క్వాలిఫై అవుతుందంటూ తన గారాలపట్టి రాసిన లేఖను నెటిజన్లతో పంచుకున్నారు.

Samayam Telugu 29 Nov 2018, 7:02 pm
తాము అనుకున్నది దక్కించుకోవడంలో నేటి జనరేషన్ పిల్లలు ఎంత తెలివిగా వ్యవహరిస్తారో అందరికీ తెలిసిందే. నచ్చింది కొనిచ్చేంత వరకు వారు పట్టు వదలరు. కొందరు ఏడిచి గోల పెట్టి మరీ పంతం నెగ్గించుకుంటే.. మరి కొందరు మాత్రం అమ్మానాన్నల్ని తెలివిగా లైన్లో పెట్టి కావాల్సింది దక్కించుకుంటారు. హీరో మంచు విష్ణు కూతురు వివియానా కూడా ఇదే కోవలోకి వస్తుంది.
Samayam Telugu manchu vishnu


బర్త్ డే గిఫ్ట్ కోసం వివియానా తనను ఎమోషనల్‌గా ఎలా బ్లాక్‌మెయిల్ చేసిందో చెబుతూ మంచు విష్ణు గురువారం ఓ ట్వీట్ చేశారు. ‘డియర్ నాన్నా.. ఈ విశ్వంలో నాకు నువ్వెంతో ముఖ్యమైన, ప్రత్యేకమైన వ్యక్తివి. పుట్టిన రోజున నేనేం కోరుకుంటే అది కొనిస్తావ్. ఈసారి రోలర్ స్కేట్స్ కొనిస్తావ్ కదూ. ప్లీజ్ కొనిస్తావా..? అవునో కాదో టిక్ చేయ్‌’ అంటూ ఓ లేఖ రాసి ఉంచింది.
దీన్ని ట్వీట్ చేసిన మంచు విష్ణు.. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కు ఇది క్వాలిఫై అవుతుందనుకుంటున్నా అని కామెంట్ జత చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడి కుమార్తె అయిన విరానికా రెడ్డిని విష్ణు 2009లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2011లో అరియానా, వివియానా జన్మించగా.. ఈ ఏడాది జనవరి 1న బాబు జన్మించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.