యాప్నగరం

దర్శక దిగ్గజం మణిరత్నంకు గుండెపోటు

ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నంకు గుండె పోటు వచ్చింది. గురువారం (జులై 26) మధ్యాహ్నం ఆయనకు ఛాతీలో తీవ్రమైన నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయణ్ని హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 26 Jul 2018, 4:56 pm
ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నంకు గుండె పోటు వచ్చింది. గురువారం (జులై 26) మధ్యాహ్నం ఆయనకు ఛాతీలో తీవ్రమైన నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయణ్ని హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu mani


గీతాంజలి, రోజా, నాయుకుడు, బొంబాయి, యువ లాంటి చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన దర్శకుడు మణిరత్నం. నేటి తరం దర్శకులు ఆణిముత్యాల్లాంటి ఆయన సినిమాల నుంచి స్ఫూర్తి పొందుతారు. తెలుగు, తమిళంతో పాటు హిందీలో పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. సంగీత దర్శకుడు, స్వర సామ్రాట్ ఏ.ఆర్. రెహమాన్‌ను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది మణిరత్నమే.

మణిరత్నం సతీమణి ప్రముఖ నటి సుహాసిని. ఆయనకు ప్రస్తుతం 63 ఏళ్లు. ప్రస్తుతం తమిళంలో ఆయన ‘చెక్క చీవంత వాణం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. అరవింద్‌ స్వామి, విజయ్‌ సేతుపతి, సింబు, అథితి రావ్‌ హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగులో ‘నవాబ్‌’ పేరుతో విడుదల కాబోతోంది. మణిరత్నం త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.