యాప్నగరం

స్టార్ హీరోతో మణిరత్నం మూవీ?

దక్షిణాది అగ్ర దర్శకుల్లో ఒకరైన మణిరత్నంతో కలిసి పని చేయడానికి చాలా మంది హీరోలు ఆసక్తి చూపుతుంటారు.

TNN 16 Aug 2017, 9:26 pm
దక్షిణాది అగ్ర దర్శకుల్లో ఒకరైన మణిరత్నంతో కలిసి పని చేయడానికి చాలా మంది హీరోలు ఆసక్తి చూపుతుంటారు. ఆయన సినిమాలో నటించడం చాలా మందికి ఓ కల. అయితే ఒక్కప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆయన క్రేజ్ తగ్గిందనే చెప్పాలి. రీసెంట్‌గా ఆయన తెరకెక్కించిన 'చెలియా' సినిమా కూడా దెబ్బ కొట్టింది. దీంతో రామ్ చరణ్‌తో చేయాల్సిన సినిమా కాస్త వెనక్కి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తారని అన్నారు. కానీ ఇప్పుడు మణిరత్నం దృష్టి ఓ యంగ్ హీరో మీద పడింది.
Samayam Telugu mani ratnam next movie with vijay sethupathi
స్టార్ హీరోతో మణిరత్నం మూవీ?


కోలీవుడ్‌లో విలక్షణమైన చిత్రాల్లో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు హీరో విజయ్ సేతుపతి. మణిరత్నం లాంటి దర్శకుడితో కలిసి విజయ్ సేతుపతి పని చేస్తుండడం విశేషమనే చెప్పాలి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని విజయ్ సేతుపతి ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు కోలీవుడ్‌లో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. లెజండరీ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, ఏఆర్ రెహ్మాన్ వంటి టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేయనున్నారు. మణిరత్నం స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.