యాప్నగరం

Ravi Teja: ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్విట్టర్ రివ్యూ.. హై ఓల్టేజ్ మాస్ ప్యాకెజ్

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా.. శరత్ మండవ (Sarath Mandava) డైరెక్షన్‌లో రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ (Rama Rao On Duty) మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుని పోతున్న మాస్ రాజా.. రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో మాస్ జాతర చేస్తూ తన అభిమానులకు గుర్తుండిపోయే మాస్ ఫీస్ట్ మూవీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. మరి ట్వి ట్వర్‌లో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది..? మాస్ మహారాజా ఖాతాలో హిట్ పడిందో లేదో చూద్దాం.

Authored byAshok Krindinti | Samayam Telugu 29 Jul 2022, 8:50 am
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) బిగ్ స్క్రీన్లపై ఆడియన్స్‌ను అలరించేందుకు డ్యూటీ ఎక్కేశాడు. రామారావు ఆన్ డ్యూటీ (Rama Rao On Duty) మూవీ నేటి (జులై 29) నుంచి థియేటర్స్‌లో సందడి చేస్తోంది. శరత్ మండవ (Sarath Mandava) డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో ర‌జిషా విజ‌య‌న్‌ (Rajisha Vijayan), దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik) హీరోయిన్స్‌గా నటించారు. వేణు తొట్టెంపూడి (Venu Thottempudi) కీ రోల్ ప్లే చేశాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, ట్రైలర్ ఆకట్టుకోవడం.. రవితేజ పవర్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి మాస్ మహారాజా ఆ అంచనాలను అందుకున్నాడా..? రవి తేజ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ హిట్ పడినట్లేనా..? ట్వీట్టర్‌లో (Ramarao on Duty Twitter Review) ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం..
Samayam Telugu రామారావు ఆన్ డ్యూటీ ట్వీట్టర్ రివ్యూ


డిప్యూటీ కలెక్టర్ క్యారెక్టర్‌లో హై ఓల్టేజ్ మాస్ డైలాగ్స్‌లో మాస్ మాహారాజా అదరగొట్టేసినట్లు తెలుస్తోంది. చట్టానికి లోబడి, న్యాయం కోసం బాధ్యత నిర్వహించే పాత్రలో రవితేజ యాక్టింగ్ హైలెట్ అని చెప్పొచ్చని ఆడియన్స్ అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో రవితేజ్ లుక్, మాస్ ఎలిమెంట్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. సాంగ్స్ యావరేజ్‌గా ఉన్నా.. బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌ సూపర్‌గా ఉందంటున్నారు. శరత్ మండవకు డైరెక్టర్‌గా ఇది తొలి సినిమానే అయినా.. రవి తేజను సరికొత్తగా చూపించాడని.. కొన్ని డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయంటున్నారు.
ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని.. ఫస్ట్ టూ గుడ్ అంటూ అని ఆడియన్స్ చెబుతున్నారు. రవితేజ కంప్లీట్లీ మాస్ అవతార్‌లో కనిపిస్తారని అంటున్నారు. సెకండాఫ్‌లో మలుపులు, ట్విిస్టులతో స్క్రీన్‌ ప్లే మెస్మరైజ్ చేస్తుందని.. క్లైమాక్స్ సీన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయని టాక్ వస్తోంది. ట్వీట్టర్‌లో సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండడంతో మాస్ మహారాజా ఫ్యాన్స్ సంబురాలు అప్పుడే అంబరాన్ని అంటేశాయి. రవి తేజకు హై ఓల్టేజ్ మాస్ ప్యాకెజ్ హిట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.