యాప్నగరం

ఇద్దరితో రవితేజ రొమాన్స్... లక్కీ ఛాన్స్ కొట్టేసిన కుర్ర హీరోయిన్లు

రాక్షసుడు డైరెక్టర్ రమేశ్ వర్మతో కలిసి రవితేజ చేయబోయే సినిమాలో ఇద్దరు హీరోయిన్లను తీసుకున్నారు. తెలుగమ్మాయి డింపుల్ హయాతితో పాటు మీనాక్షి చౌధురిని సెలక్ట్ చేశారు.

Samayam Telugu 17 Oct 2020, 8:18 am
మాస్ మహారాజ్‌ ప్రస్తుతం ‘క్రాక్’ షూటింగులో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండటంతో... డింపుల్ హయాతి, మీనాక్షి చౌధురిని తీసుకున్నారు. తెలుగమ్మాయి అయిన డింపుల్ హయాతి ‘గద్దలకొండ గణేష్‌’లో ‘జర్ర జర్ర...’ పాటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు రెండు మూడు చిన్న చిత్రాల్లో కథానాయికగా నటించినా సరైన గుర్తింపు రాలేదు. ప్రభుదేవా, తమన్నా కాంబినేషన్లో వచ్చిన ‘అభినేత్రి-2’లోనూ కనిపించింది. ఇప్పుడు ఏకంగా రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేయడంతో డింపుల్ దశ తిరిగినట్లేనని చెప్పొచ్చు.
Samayam Telugu ఇద్దరు హీరోయిన్లతో రవితేజ


Also Read: పూరీ జగన్నాథ్ పాన్ ఇండియా సినిమా.. కేజీఎఫ్‌ స్టార్‌తో చర్చలు!

మరో హీరోయిన్‌గా ఎంపికైన మీనాక్షి చౌధురి ప్రస్తుతం సుశాంత్‌‌తో ‘ఇచట వాహనములు నిలుపరాదు’లో సినిమాలో నటిస్తున్నారు. అంతకు ముందు నిధి అగర్వాల్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌ పేర్లను పరిశీలించినా చివరికి డింపుల్, మీనాక్షికి లక్కీఛాన్స్ దక్కింది. ‘రాక్షసుడు’ బ్లాక్‌‌బస్టర్ తర్వాత రమేశ్‌ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్‌ 2న ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Also Read: డ్రగ్స్ రాకెట్‌లో మరో వ్యక్తి అరెస్ట్.. సుశాంత్ కేసులో కీలక మలుపులు.. సీబీఐ ఫైనల్ రిపోర్ట్..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.