యాప్నగరం

విక్రమ్‌రాథోడ్‌ని మరిపిస్తున్న మాస్‌రాజా

రెండేళ్ల పాటు గ్యాప్ తీసుకొని 'రాజా ది గ్రేట్' చిత్రంతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు మాస్ మహారాజ రవితేజ. దీంతో అతడి సినిమాపై అభిమానులకు మరింత ఆసక్తి పెరిగింది. తాజాగా మాస్ రాజా.. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' అనే సినిమాలో నటిస్తున్నాడు.

TNN 2 Dec 2017, 7:55 pm
రెండేళ్ల పాటు గ్యాప్ తీసుకొని 'రాజా ది గ్రేట్' చిత్రంతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు మాస్ మహారాజ రవితేజ. దీంతో అతడి సినిమాపై అభిమానులకు మరింత ఆసక్తి పెరిగింది. తాజాగా మాస్ రాజా.. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మినహా ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. అప్పుడెప్పుడో షూటింగ్ మొదలు కావడానికి ముందుకు ఒక మోషన్ టీజర్‌ను మాత్రం విడుదల చేసి ఊరుకున్నారు.
Samayam Telugu mass raja police officer role in touch chesi chudu movie
విక్రమ్‌రాథోడ్‌ని మరిపిస్తున్న మాస్‌రాజా


మరో నెల రోజుల్లో విడుదల పెట్టుకొని ఇంకా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి స్టిల్స్ బయటకు వచ్చాయి. పోలీస్ గెటప్‌లో రవితేజ లుక్ మాస్ ఫ్యాన్స్ ఖుషీ చేసుకునే రేంజ్‌లో ఉంది. గతంలో విక్రమార్కుడు చిత్రంలో విక్రమ్ రాథోడ్ లాంటి సీనియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టేసిన రవితేజ.. ఆ తరువాత 'పవర్' సినిమాలో పోలీస్ గెటప్‌లో కనిపించి అలరించారు. అయితే ఈసారి మాత్రం కాస్త స్లిమ్ అవ్వడంతో పోలీస్ డ్రెస్‌లో ఫిట్‌గా కనిపిస్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.