యాప్నగరం

మాస్‌రాజా ‘నేల టిక్కెట్’ మొదలెట్టేశాడు!

మాస్ రాజా రవితేజ-కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘నేల టిక్కెట్’ (ప్రచార టైటిల్) మూవీ శుక్రవారం హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది.

TNN 5 Jan 2018, 12:02 pm
మాస్ రాజా రవితేజ-కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘నేల టిక్కెట్’(ప్రచార టైటిల్) శుక్రవారం హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ‘రాజా ది గ్రేట్’ మూవీతో సక్సెస్ అందుకున్న మాస్ రాజా రవితేజ.. ‘టచ్ చేసి చూడు’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ దశలో ఉండగానే కళ్యాణ్ క్రిష్ణ దర్శకత్వంలో మరో సినిమాను లైన్‌లో పెట్టేశాడు రవితేజ. ఈ సందర్భంగా తన కొత్త చిత్ర షూటింగ్ ప్రారంభమైనట్లు హీరో రవితేజ ట్వీట్ చేస్తూ చిత్ర యూనిట్‌తో కలిసిదిగిన ఫోటోను షేర్ చేశారు.
Samayam Telugu mass raja ravi teja and kalyan krishna film shooting started
మాస్‌రాజా ‘నేల టిక్కెట్’ మొదలెట్టేశాడు!


జనవరి 5న(ఈరోజు) షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు ‘నేల టికెట్’ అనే పక్కా మాస్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మొదట్లో ఈ సినిమాకు ‘బంగార్రాజు’ అనే టైటిల్ ప్రచారం ఉన్నప్పటికీ.. ఫైన‌ల్‌గా ‘నేల టికెట్’కే మొగ్గుచూపించి చిత్రయూనిట్. ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’లాంటి వరుస సక్సెస్‌లతో క్రేజీ డైరెక్టర్‌గా మారిన కళ్యాణ్ కృష్ణ.. రవితేజ కోసం ఓ మాస్ మసాలా చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి.

కాగా ఈ చిత్రంలో సీనియర్ నటుడు జగపతిబాబు మరో విలన్ రోల్ చేయబోతున్నట్టు సమాచారం. ఎస్‌.ఆర్‌.టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఫిదా మ్యూజిక్ డైరెక్టర్ శక్తీ కాంత్ సంగీతం అందిస్తున్నారు. మాళవిక శర్మ మాస్ రాజాతో జోడీ కడుతోంది.

First day at shoot with Director @kalyankrishna_k for my next under #SRTEntertainments. pic.twitter.com/IK3yd1QBJv — Ravi Teja (@RaviTeja_offl) January 5, 2018

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.