యాప్నగరం

Me Too నిందితుడితో కలిసి రజనీ, కమల్ పకపకలు

ప్రముఖ తమిళ రచయిత వైరాముత్తుపై చిన్మయి శ్రీపాద లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కానీ అతనిపై ఇప్పటివరకు ఎవ్వరూ చర్యలు తీసుకుంది లేదు.

Samayam Telugu 8 Nov 2019, 4:47 pm
పేరున్న సెలబ్రిటీలపై ఎన్ని ఆరోపణలు వచ్చినా వాటిని ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోరని ఎప్పుడో ఒకప్పుడు అవి గాలికి కొట్టుకుపోతాయని ఆ ఘటనతో మరోసారి రుజువైంది. ప్రముఖ తమిళ లిరిసిస్ట్ వైరాముత్తు తనను లైంగికంగా వేధించాడని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద షాకింగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 13 ఏళ్ల క్రితం వర్క్ ట్రిప్స్ నిమిత్తం వెళ్లినప్పుడు తనను వైరాముత్తు గదిలోకి రమ్మని వేధించాడని అన్నారు. దాంతో కోలీవుడ్ మొత్తం షాకైంది. అయినా కూడా వైరాముత్తును ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. పైగా అతనిపై ఆరోపణలు చేసినందుకు చిన్మయిని డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించారు.
Samayam Telugu chinmayi sripada
చిన్మయి శ్రీపాద


READ ALSO: నాలుగో హీరోయిన్‌తో Kamal Haasan డేటింగ్?

చిన్మయికి బెదిరింపులు కూడా వచ్చాయి. అయినా ఆమె వెనకడుగు వేయలేదు. తనకు న్యాయం జరిగేలా చూడాలని మహిళా సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సాయం కోరారు. ట్విటర్‌లో ఆమెకు రిక్వెస్ట్ పెట్టారు. దాంతో మేనకా ఈ వివరాలను మహిళా కమిషన్‌కు ఫార్వర్డ్ చేశారు. ఇంత జరిగినా చిన్మయికి న్యాయం జరగలేదు. ఎవరి పాపాన వారే పోతారు అనుకుని చిన్మయి తన పని తాను చూసుకుంటోంది. అయితే తమిళ చిత్ర పరిశ్రమలో కమల్ హాసన్, రజనీకాంత్‌లను మించిన పవర్‌ఫుల్ వ్యక్తులు ఎవ్వరూ లేరు. ఇద్దరూ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వారు తలుచుకుంటే వైరాముత్తుపై కేసు పెట్టి లోపల వేయించవచ్చు. కానీ మాకెందులే అని ఇద్దరూ మౌనంగా ఉన్నారు. అంతేకాదు ఈరోజు ప్రముఖ దర్శకుడు కే బాలచందర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రజనీ, కమల్ హాసన్ వెళ్లారు. ఈ వేడుకకు వైరాముత్తు కూడా వెళ్లారు. వైరాముత్తుపై వచ్చిన ఆరోపణలు తెలిసీ ఇద్దరూ ఆయనతో నవ్వుతూ ముచ్చట్లు చెప్పడం వైరల్ అవుతోంది. దీనిపై చిన్మయి బాధపడుతూ ట్వీట్ చేశారు.

కమల్ రజనీలతో వైరాముత్తు


READ ALSO: Poonam Kaur: పాక్ ప్రధాన మంత్రిని కలవాలని ఉంది

‘ఒక మగాడిపై మీటూ ఆరోపణలు వస్తే అతని జీవితం నాశనం అయిపోతుంది. ఎవ్వరికీ ముఖం చూపించలేడు. నలుగురితో కలిసి బయట తిరగలేడు. కానీ డీఎంకే నిర్వహించే అన్ని వేడుకలకు వైరాముత్తు చీఫ్ గెస్ట్‌గా హాజరువుతున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనింగ్ ఈవెంట్స్‌కి హాజరవుతున్నాడు. అతనికి ఏమీ అవ్వలేదు. ఆరోపణలు చేసిన నన్ను మాత్రం వెంటనే డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు ఈ విధంగా న్యాయం చెప్పారు. వేధించిన వాడితో పార్టీలు, ఆరోపించిన వారిని బ్యాన్ చేశారు’ అంటూ రజనీ, కమల్‌ను పరోక్షంగా టార్గెట్ చేశారు.

READ ALSO: Kangana అక్రమ సంబంధంపై స్పందించిన యువ హీరో

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.