యాప్నగరం

#MeToo: అలా చేయకపోతే అంతా వృథాయే.. సుస్మితా సేన్

దేశంలో సంచలనం సృష్టిస్తున్న #MeToo ఉద్యమంపై మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ కూడా స్పందించింది. ఈ ఉద్యమం గురించి ఆమె ఏమన్నారంటే..

Samayam Telugu 11 Oct 2018, 9:32 pm
హిళలు తాము ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న లైంగిక వేదింపులు గురించి #MeToo ద్వారా సోషల్ మీడియాలో బహిర్గతం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మిస్ యూనివర్శ్, ప్రముఖ బాలీవుడ్ నటి సుస్మితా సేన్ సైతం స్పందించారు. అయితే, ఆమె వివాదాలకు తావులేకుండా #MeToo ఉద్యమం గురించి తన అభిప్రాయాన్ని చెప్పారు.
Samayam Telugu Untitled123


గురువారం ఢిల్లీలో జరిగిన లోటస్ మ్యాకప్ ఇండియా ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న సుస్మితా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘మీటూ ఉద్యమాన్ని పాశ్చాత్య దేశాల నుంచి కాపీ కొట్టాం. ఆ విషయాన్ని మనం పెద్దగా పట్టించుకో అక్కర్లేదు. అయితే, మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి తమ లైంగిక వేదింపులు గురించి బయటకు వెల్లడించడం చాలా గ్రేట్ అనిపిస్తోంది. సమాజంలో భాగంగా మనం (ప్రజలు) బాధితులు చెప్పే విషయాలను వినాలి. అది తప్పా, కాదా అనేది మనం నిర్ణయించకూడదు. అలాగని, వారిని పట్టించుకోకుండా వదిలేయకుండా, మరింత ప్రోత్సహించాలి. అప్పుడే ఆ ఉద్యమానికి సార్ధకత లభిస్తుంది. లేకుంటే వృథా అవుతుంది’’ అని తెలిపింది.
Photo credit: IANS

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.