యాప్నగరం

పవన్ అదోటైపు.. నాగబాబు ఆసక్తికర కామెంట్స్

మెగా బ్రదర్ నాగబాబు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ రాజకీయ ప్రస్థానంపై పలు ఆసక్తికర కామెంట్స్ చేయడంతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచారు. తమ్ముడి గురించి అన్న ఏమన్నాడో చూద్దాం..

TNN 3 Dec 2016, 7:30 pm
టాలీవుడ్‌లో మెగాబ్రదర్ నాగబాబు ఈమధ్య కాలంలో రకరకాల కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. మోడీ కొత్తనోట్ల వ్యవహారంలో తన అభిప్రాయాన్ని వీడియో ద్వారా తెలియజేసి హాట్ టాపిక్ అయ్యాడు. తాజాగా తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
Samayam Telugu mega brother naga babu has made sensational comments on pawan kalyans
పవన్ అదోటైపు.. నాగబాబు ఆసక్తికర కామెంట్స్


పవన్ కళ్యాణ్ సాదాసీదాగా పార్టీ పెట్టలేదని ఉన్నతమైన ఐడియాలజీతోటే రాజకీయాల్లోకి దిగాడంటూ.. మా వాడు అభిమానులు కోరితే రాజకీయాల్లోకి వచ్చే రకం కాదు. వాడు అదో టైపు మనిషి.. ఒకరు రమ్మంటి వచ్చి, పొమ్మంటే పోయే రకం కాదు, కల్యాణ్ బాబు తేడా మనిషి. అభిమానులు పెట్టమన్నారని జనసేన పార్టీ పెట్టలేదు. లేకపోతే మా అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి, సక్సెస్ కాలేదు కాబట్టి పవన్ పార్టీ పెట్టలేదు. వాడికంటూ ఒక ప్రణాళిక ఉంది.

అన్నింటికీ మించి ఉన్నతమైన మనస్థత్వం ఉంది. గ్రేట్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్‌ది, వాడిలో బోలెడంత ఫ్రస్ట్రేషన్ ఉంది. ఏదో చేయాలనే తపన ఉంది. నాకు, వాడికి తేడా ఏంటంటే.. ‘కర్మ... వదిలెయ్’ అని నేను వదిలేస్తాను. వాడు వదలడు. వాడు అమీతుమీ తేల్చుకునే రకం.’’ అంటూ జనసేనాని గురించి తెలియజేశారు నాగబాబు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.