యాప్నగరం

Naga Babu: మీకు దమ్ముంటే ఆ పని చేయండి.. విసిగించిన పవన్ ఫ్యాన్స్‌కు నాగబాబు చురకలు

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు నాగబాబును (Naga Babu) విసిగించారు. నాగబాబు మాట్లాడుతుండగా పదే పదే సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో అసహనానికి గురైన నాగబాబు నవ్వుతూనే అభిమానులకు చురకలు అంటించారు.

Authored byవరప్రసాద్ మాకిరెడ్డి | Samayam Telugu 27 Mar 2023, 4:02 pm

ప్రధానాంశాలు:

  • ఘనంగా రామ్ చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్
  • ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగా బ్రదర్ నాగబాబు
  • నాగబాబు మాట్లాడుతుంటే నినాదాలతో విసిగించిన ఫ్యాన్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ హడావుడి ఎలా ఉంటుందో, ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకున్నది అభిమానులు కాదని.. భక్తులని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారంటే పవన్ కల్ట్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఈ డైహార్డ్ ఫ్యాన్స్ ప్రవర్తన ఒక్కోసారి మితిమీరిపోతూ ఉంటుంది. స్వయంగా వేదికపై పవన్ కళ్యాణే మాట్లాడుతున్నా పట్టించుకోరు. సీఎం, సీఎం అంటూ నినాదాలు చేస్తూనే ఉంటారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబును (Naga Babu) కూడా ఇలాగే విసిగించారు.
ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో రామ్ చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకలకు మెగా బ్రదర్ నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ గురించి నాగబాబు మాట్లాడుతూ ఉండగా బాల్కనీలో ఉన్న కొంత మంది పవన్ కళ్యాణ్ అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. వారు అరుస్తుండటంతో నాగబాబు మాట్లాడటానికి ఇబ్బంది పడ్డారు. కాసేపు నిశ్శబ్ధంగా ఉండాలని, పవన్ కళ్యాణ్ గురించి ఆఖరిలో మాట్లాడతానని నాగబాబు రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ పవన్ ఫ్యాన్స్ తగ్గలేదు. దీంతో ఒకింత అసహనానికి గురైన నాగబాబు.. నవ్వుతూనే అభిమానులకు చురకలు అంటించారు.
Pawan Kalyan: జనాభా లెక్కల్లో ఒక్కడు కాదు, లెక్కలేనంత జనాభాకి ఒకే ఒక్కడు.. పవన్ కళ్యాణ్‌పై హైపర్ ఆది ప్రశంసల వర్షం
‘ఈరోజు వచ్చింది చరణ్ బాబు బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి కాబట్టి మొదట గౌరవం చరణ్ బాబుకి ఇవ్వాలి. అది మన సంస్కారం. జనసైనికులు ఆ సంస్కారాన్ని వదులుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని రామ్ చరణ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు నాగబాబు. అప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు తగ్గకపోవడంతో ఆల్ ఇండియా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి నాయుడిని పిలిచి మరీ చెప్పించారు. అయినప్పటికీ ఎలాంటి మార్పూ లేదు. దీంతో మరోసారి నాగబాబు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

‘పవన్ కళ్యాణ్ మీటింగ్స్‌లో మీ అందరికీ చాలా సార్లు చెప్పాడు కదా. సీఎం సీఎం అని అరిస్తే కాదు.. ఓట్లు గుద్ది సీఎంని చేయమని. కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే సీఎం సీఎం అని అరిస్తే సరిపోదు.. మీకు దమ్ముంటే ఎలక్షన్‌లో పాల్గొని జనాలను మోటివేట్ చేయండి. అది పవన్ కళ్యాణ్‌కు మనం ఇచ్చే గొప్ప బహుమతి’ అని అభిమానులకు నాగబాబు చురకలు అంటించారు. ఈ కార్యక్రమానికి వచ్చిందే తాను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటానికని, కాస్త ఆగితే మొదలుపెడతానని మళ్లీ ఫ్యాన్స్‌ను కూల్ చేసే ప్రయత్నం చేశారు మెగా బ్రదర్. తనను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేంత వరకు వెళ్లనివ్వకుంటే తాను ఏమి చేయగలనని నవ్వుతూనే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. ‘మా ఇంట్లో మా అందరికీ ఒక పెద్ద కొడుకు లాంటోడు చరణ్ బాబు. అలాంటి బిడ్డ మా ఇంట్లో పుట్టినందుకు ఒక్క చిరంజీవి గారికే కాదు.. నాకు, కళ్యాణ్ బాబుకి కూడా చాలా గర్వకారణం. హిందీలో చరణ్‌ను చాలా తక్కువ చేసి మాట్లాడినవారు ఉన్నారు. అలాంటిది ఈరోజు మొత్తం బాలీవుడ్ చరణ్ వైపు చూసేంత గొప్ప సక్సెస్‌ను సాధించినందుకు మనందరం చరణ్‌ను అభినందించాలి. చరణ్ బాబుకి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నా ఆశీర్వాదాలు అందజేస్తున్నాను. అతను ఆయురారోగ్యాలతో నూరేళ్లు చల్లగా ఉండాలి. ఐ లవ్ యు చరణ్. ఆస్కార్ అవార్డు వచ్చిన ఒక సినిమాకి ఆస్కార్ ఫంక్షన్‌లో తాను మేజర్‌గా స్క్రీన్ మీద కనిపించినప్పుడు ప్రతి తెలుగు వాడు మనస్ఫూర్తిగా గర్వించారు. మన తెలుగువారి పేరు ప్రపంచానికి తెలియజేసినందుకు రాజమౌళి టీమ్‌కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని వెల్లడించారు.
రచయిత గురించి
వరప్రసాద్ మాకిరెడ్డి
వరప్రసాద్ మాకిరెడ్డి సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో టెక్నాలజీ, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.