యాప్నగరం

Naga Babu: జనసేన పార్టీకి రూ. 100 కోట్లు ఫండ్: నాగబాబు సంభ్రమాశ్చర్యం

Pawan Kalyan: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మెగా అభిమానులకు, జనసైనికులకు, ఇతర హీరోల అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షల్ని తెలియజేశారు మెగా బ్రదర్ నాగబాబు.

Samayam Telugu 2 Sep 2019, 6:18 pm
ఎన్నికల సందర్భంగా యూట్యూబ్‌లో ‘మై ఛానల్ నా ఇష్టం’ అంటూ వరుస వీడియోలను విడుదల చేసి హాట్ టాపిక్ అయిన మెగా బ్రదర్ నాగబాబు స్మాల్ గ్యాప్ తరువాత మళ్లీ తన ఛానల్‌కి వచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఏడున్నర నిమిషాల నిడివితో వీడియోను వదిలారు. జనసేన పార్టీకి కోసం కష్టపడుతున్న జనసైనికులకు కృత‌జ్ఞత తెలిపడమే ఈ వీడియో సారాంశం.
Samayam Telugu Pawan Kalyan Janasena


ఇంతకీ నాగబాబు ఈ వీడియోలో ఏమన్నారంటే.. ‘జనసేన, మెగా, ఇతర హీరోల అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే.. ఎవరైనా వ్యక్తి ఒక మంచి పని చేశారంటే అభినందించడం నాకు మా ముగ్గురు అన్నదమ్ములకు అలవాటు. అందుకే మంచి పనికి పూనుకున్న జనసైనికులను అభినందించడం కోసం ఈ వీడియో చేశా.

జనసేనకు రూ. 100 కోట్ల ఫండ్..

కళ్యాణ్ బాబు స్థాపించిన ‘జనసేన’ పార్టీకి రూ. 100 కోట్ల ఫండ్‌ను సేకరించాలని జనసైనికులు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. రూ. 10 నుండి రూ. లక్షల వరకూ డొనేషన్ కలెక్ట్ చేయాలని వాళ్లు ఒక నిర్ణయం తీసుకోవడం అభినందించాల్సిన విషయం.

దేశంలో ఇంతకు ముందు ఎన్నో పార్టీలు వచ్చాయి. కాని ఏ పార్టీకి ఇంత భారీ స్థాయిలో పార్టీకి ఫండ్ ఇద్దాం అని అభిమానులు అందరూ అనుకోవడం. శనివారం రోజే బ్యాంక్‌లకు వచ్చి బారులు తీరి డొనేషన్లు ఇవ్వడం అనేది షాక్‌కి గురి చేసింది. ఒక రకంగా చెప్పాలంటే సంభ్రమాశ్చర్యానికి గురిచేసిందని చెప్పాలి (నవ్వుతూ).

ఎందుకంటే ఇంతిలా అభిమానించేవాళ్లు జనసేనకు ఉన్నందుకు చాలా సంతోషంగానూ ఎమోషనల్‌గానూ ఉంది. మీరు అనుకున్న రూ. 100 కోట్లును ఎచీవ్ చేశారా? లేదా అన్నది సెకండరీ. కాని రూ. 100 కోట్లు ఇవ్వాలనే మీ సంకల్పం చాలా గొప్పది. ఇలాంటి నిర్ణయాల వల్ల జనసేనకు ఫైనాన్సియల్ ప్రాబ్లమ్ ఎప్పటికీ రాదు. అయితే మీరు అభిమానం చూస్తుంటే జనసేన కేడర్ చాలా స్ట్రాంగ్ అయ్యిందని స్పష్ఠం అవుతుంది. యుద్ధంలో ఓడిపోయిన వారియర్స్‌లో పోరాటం చేస్తూనే ఉన్నారు జనసైనికులు’.. ఇంకా నాగబాబు ఏమన్నారో ఈ వీడియోలో చూడొచ్చు.

video and photo courtesy By Nagababu Official

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.