యాప్నగరం

దేవుడు చచ్చిపోయాడు.. సీనియర్ హీరో వ్యాఖ్యలపై నాగబాబు కౌంటర్స్! లాజిక్ లాగుతూ షాకింగ్ కామెంట్స్

మెగా బ్రదర్ నాగబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి ఆయన దేవుడు అనే కాన్సెప్టే అబద్ధం అని చెప్పడం పలు చర్చలకు తావిచ్చింది.

Samayam Telugu 13 Jul 2020, 6:11 pm
జనసేన లీడర్, మెగా బ్రదర్ నాగబాబు మరోసారి రెచ్చిపోయారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అది ఎలాంటి విషయమైనా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటపెడుతున్న ఆయన.. తాజాగా దేవుడు చచ్చిపోయాడంటూ సంచలన కామెంట్ చేశారు. అసలు దేవుడే లేడంటూ ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అయి పలు చర్చలకు దారితీసింది. అంతేకాదు ఈ ట్వీట్ చేస్తూ సీనియర్ స్టార్ హీరో రజినీకాంత్ వ్యాఖ్యలను నాగబాబు ప్రస్తావించడం హాట్ ఇష్యూగా మారింది.
Samayam Telugu దేవుడు చచ్చిపోయాడు.. సీనియర్ హీరోపై నాగబాబు కౌంటర్స్!
Nagababu


''ఒకప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒక మాట చెప్పారు. అది ఏటంటే.. మన కంటికి కనబడే ఏదయినా సరే ఎవరో ఒకరు క్రియేట్ చేసిందే అయి ఉంటుందని. లేకపోతే ఆ వస్తువుకి ఉనికి ఉండదు. అలాగే ఇంత విశాల విశ్వం కూడా ఉనికిలో ఉందంటే ఎవరో ఒక క్రియేటర్ ఉండే ఉండాలి. అతడే భగవంతుడు అని చాలా గంభీరంగా రజినీకాంత్ గారు చెప్పారు'' అని పేర్కొన్న నాగబాబు దాంట్లో ఉన్న లాజిక్ బయటకు లాగారు.

''మరి అంత క్రియేట్ చేసిన దేవుడిని క్రియేట్ చేసింది ఎవరు. ఒక శక్తి ఉనికిలో ఉందంటే దానికి ఒక క్రియేటింగ్ రీజన్ వేరే ఉండాలి. ఆ రీజన్ దేవుడిని క్రియేట్ చేసి ఉండాలి. అలాగే ఆ దేవుడిని క్రియేట్ చేసిన రీజన్‌కి ఇంకో రీజన్ ఉండాలి. సో అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే అంతూ పొంతూ ఉండదు'' అంటూ రజినీకాంత్ వ్యాఖ్యలపై కౌంటర్స్ వేశారు నాగబాబు.

Also Read: Power Star: వెండితెరపై రామ్ గోపాల్ వర్మ.. ఆ కీలక రోల్ ఆయనదే! వైరల్ అవుతున్న లేటెస్ట్ పోస్టర్

అంతటితో ఆగక.. ''సో గాడ్ అనే కాన్సెప్ట్‌కి మీనింగ్ లేదు. కాబట్టి గాడ్ ఇన్వాల్మెంట్ లేకుండా మన జీవితాల్ని మనం ఇష్టం ఉన్నట్లుగా జీవించాలి. చాలా రోజుల క్రితమే దేవుడు చచ్చిపోయాడు. దుకే ఎలాంటి వర్రీస్ లేకుండా, దేవుడిపై ఆధారపడకుండా కేవలం చట్టాలకు అనుగుణంగా బ్రతకాలి'' అని పేర్కొంటూ మరో సంచలన ట్వీట్ చేశారు మెగా బ్రదర్.

అయితే ఉన్నట్టుండి నాగబాబు ఇలా దేవుడి కాన్సెప్ట్ ఎందుకు తీశారనేది అర్థం కావడం లేదు జనాలకు. దేవుడు అనే కాన్సెప్టే అబద్ధం అని ఆయన పేర్కొనడం పట్ల నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. దీంతో ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతూ రచ్చకు కారణమయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.