యాప్నగరం

లవర్స్ డే‌కి మెగా గిఫ్ట్.. ‘తొలిప్రేమ’?

‘ఫిదా’ మూవీతో సన్సేషనల్ హిట్ కొట్టిన మెగా హీరో వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం రిలీజ్ డేట్‌ను ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశారు.

TNN 30 Oct 2017, 5:56 pm
‘ఫిదా’ మూవీతో సన్సేషనల్ హిట్ కొట్టిన మెగా హీరో వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం రిలీజ్ డేట్‌ను ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి ప‌తాకంపై వ‌రుణ్ తేజ్‌, రాశిఖ‌న్నా జంట‌గా యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో 2018 ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల చేస్తున్నట్టు ట్వీట్ చేశారు వరుణ్ తేజ్.
Samayam Telugu mega prince varun tej next movie release date confirmed
లవర్స్ డే‌కి మెగా గిఫ్ట్.. ‘తొలిప్రేమ’?


రొటీన్ కథలకు భిన్నంగా వైవిధ్యభరితపాత్రలను ఎంచుకుంటూ కంచె, ఫిదా మూవీలతో సక్సెస్ అందుకున్న వరుణ్ తేజ్ తదుపరి చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే భారీ నిర్మాణ విలువలతో వరుణ్ తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల లండన్‌లో 40 రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ నాటికి ముగుస్తుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేమికులు దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ టైటిల్‌ పరిశీలనలో ఉంది.

Coming in the month of love...#VT6 on Feb 9th 2018 Other details to follow soon!@RaashiKhanna @MusicThaman @dirvenky_atluri @george_dop pic.twitter.com/ROptrXMf8G — Varun Tej (@IAmVarunTej) October 30, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.