యాప్నగరం

Varun Tej: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ రెడీ చేస్తున్న వరుణ్ తేజ్.. పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్..!

VT13 (వర్కింగ్ టైటిల్) మూవీకి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనుంది. కొత్త సినిమాకు సంబంధించి సెప్టెంబర్ 19న అనౌన్స్‌మెంట్ రానుంది.

Authored byAshok Krindinti | Samayam Telugu 17 Sep 2022, 1:56 pm
మరో కొత్త చిత్రంతో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej). గని సినిమా వరుణ్ కెరీర్‌లో భారీ డిజాస్టర్‌గా నిలవగా.. వెంటనే F3 మూవీతో కాస్తా తేరుకున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు సినిమాపై సెట్స్‌పై ఉంచిన ఈ మెగా హీరో.. త్వరలో మరో మూవీని పట్టాలెక్కించబోతున్నాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు.
Samayam Telugu Varun Tej VT 13
వరుణ్ తేజ్


యధార్థ సంఘటనల ఆధారంగా.. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో VT13 (వర్కింగ్ టైటిల్) మూవీ తెరకెక్కనుంది. స్క్రిప్ట్ చదివి సినిమాను ఒకే చేసినట్లు వీడియోలో ఉంది. చివరకు జైహింద్ అని చూపించారు. ఈ మూవీకి 'జైహింద్' అనే టైటిల్ ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి. సెప్టెంబర్ 19న అనౌన్స్ చేస్తున్నట్లు వీడియో చివరలో చూపించారు. 'ఆకాశాన్ని తాకే ఇండియా గ్లోరీ' అంటూ వరుణ్ తేజ్‌తో వీడియో ట్వీట్ చేశాడు. ఎయిర్ వింగ్ కమాండర్‌గా ఈ యంగ్ హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుణ్ తేజ్ డిఫరెంట్ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళుతున్నాడు. కంచె, అంతరిక్షం, గద్దలకొండ గణేష్ వంటి సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించాడు. ఈ ఏడాది రిలీజ్ 'గని' సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తరువాత F3 విజయం సాధించడంతో మళ్లీ హిట్ ట్రాక్‌లో వచ్చాడు. ఇందులో నత్తి ఉన్నట్లు నటించిన వరుణ్.. అందరినీ మెప్పించాడు. తాజాగా మరో సరికొత్త క్యారెక్టర్‌తో ఆడియన్స్ రానున్నాడు ఈ మెగా హీరో.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.