యాప్నగరం

‘బాహుబలి’ని ఆకాశానికి ఎత్తేసిన చిరంజీవి!

సామాన్య ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు మాట్లాడుకునేది ‘బాహుబలి 2’ సినిమా గురించే.

TNN 30 Apr 2017, 12:37 pm
సామాన్య ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు మాట్లాడుకునేది ‘బాహుబలి 2’ సినిమా గురించే. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇప్పటికే తెలుగు సినీ ప్రముఖుల్లో చాలా మంది రాజమౌళితోపాటు ‘బాహుబలి’ టీం మొత్తాన్ని అభినందించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ‘బాహుబలి 2’ సినిమాపై స్పందించారు. చిరంజీవి పేరిట ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ తన ట్విట్టర్ ఖాతాలో ఓ మెసేజ్‌ను ట్వీట్ చేసింది.
Samayam Telugu megastar chiranjeevi congratulates baahubali 2 team
‘బాహుబలి’ని ఆకాశానికి ఎత్తేసిన చిరంజీవి!


‘బాహుబలి ది కన్‌క్లూజన్ అసాధారణ సినిమా. బాహుబలి లాంటి అద్భుతాన్ని సృష్టించిన రాజమౌళిని ప్రశంసించకుండా ఉండలేం. తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఈ సృష్టికర్తకు హ్యాట్స్ ఆఫ్. ప్రభాష్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్, నాజర్‌తో పాటు సినిమాకు పనిచేసిన అందరికీ అభినందనలు. ముఖ్యంగా రచయిత విజయేంద్ర ప్రసాద్, సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్‌తో ఇతర టెక్నికల్ బృందానికి అభినందనలు’ అని చిరంజీవి ప్రశంసించారు.
Best regards to @BaahubaliMovie @ssrajamouli - #Chiranjeevi pic.twitter.com/SmFAbV0QBY — Konidela Pro Company (@KonidelaPro) April 30, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.