యాప్నగరం

God Father: మెగా ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ.. గాడ్ ఫాదర్ టీమ్‌పై ఆగ్రహం

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్' (God Father) నుంచి ‘థార్ మార్..’ (Thaar Maar Thakkar Maar Song) అంటూ సాగే ఆడియో సాంగ్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. అయితే లిరికల్ సాంగ్ వస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకోగా.. మూవీ మేకర్స్ నిరాశకు గురి చేశారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 15 Sep 2022, 9:21 pm
'గాడ్ ఫాదర్' (God Father) మూవీ టీమ్‌పై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ‘థార్ మార్..’ (Thaar Maar Thakkar Maar Song) లిరికల్ సాంగ్ వస్తుందని అందరూ ఎక్స్‌పెర్ట్ చేయగా.. మూవీ మేకర్స్ తీవ్ర నిరాశకు గురిచేశారు. 'థార్ మార్' ఆడియో సాంగ్‌ను స్పాటిఫై యాప్‌లో విడుదల చేయడంతో ఫైర్ అవుతున్నారు. లిరికల్ సాంగ్ త్వరలో వస్తుందని చిత్ర బృందం ట్వీట్ చేసింది.
Samayam Telugu Thaar Maar Thakkar Maar Song
గాడ్ ఫాదర్ మూవీ


ఈ మాత్రం సాంగ్ రిలీజ్ చేసేందుకు ఎందుకు ప్రమోషన్స్ చేశారని మెగా ఫాన్స్ మండిపడుతున్నారు. చిరంజీవి మాస్ స్టెప్పులు చూద్దామని ఎంతో ఆశగా ఎదురుచూశామని.. కానీ మూవీ మేకర్స్ ఇలా చేస్తారని ఊహించలేదని తిట్టుకుంటున్నారు. స్పాటిఫై యాప్‌ను ప్రమోట్ చేసేందుకు ఆడియో సాంగ్ రిలీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ప్రోమోతో ఆశలు పెంచి.. ఇలా చేయడం సరికాదని అంటున్నారు.


మోహ‌న్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌లో రూపొందిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ (Salman Khan) కీలక పాత్రలో నటించాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' (Lucifer)కు ఇది రీమేక్. ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ (Ram Charan), ఆర్‌‌బీ చౌద‌రి, ఎన్‌‌వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 5న ఆడియన్స్ ముందుకు రానుండగా.. ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టింది చిత్ర బృందం. అందులో భాగంగానే ఆడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది. లిరికల్ సాంగ్ రిలీజ్ చేసి ఉంటే.. ఈపాటికే సోషల్ మీడియా మార్మోగిపోయేది.

అనుకోకుండా టెక్నీకల్ సమస్య వల్ల గాడ్ ఫాదర్ సినిమా నుంచి ‘థార్ మార్..’ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయలేకపోయామని మూవీ మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే సాంగ్ రిలీజ్ డేట్, టైమ్ ప్రకటిస్తామని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.