యాప్నగరం

God Father: గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముహూర్తం ఫిక్స్

'గాడ్ ఫాదర్' (God Father) మూవీ ప్రీ రిలీజ్ ‌ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అనంతపురంలో వేడుక కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా డేట్‌ను అనౌన్స్ చేశారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 25 Sep 2022, 3:53 pm
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 'గాడ్ ఫాదర్' (God Father) రాకకు రంగం సిద్ధమవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో వేడుక నిర్వహిస్తామని ఇంతకు ముందే ప్రకటించగా.. తాజాగా డేట్‌ను ఫిక్స్ చేశారు. ఈ నెల 28న సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
Samayam Telugu God Father pre release event
మెగాస్టార్ చిరంజీవి



పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో 'గాడ్ ఫాదర్' తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 5న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగినట్లే మూవీ మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. చిరంజీవిని యాంకర్ శ్రీముఖితో వినూత్నంగా విమానంలో ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తారని ప్రచారం జరుగుతుండగా.. మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ మూవీ రిలీజ్‌కు ముందే ఓటీటీ డిజిటల్‌ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ తెలుగు, హిందీ ఓటీటీ హక్కులను 57 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' (Lucifer)కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ ఈ సినిమాకు మోహ‌న్ రాజా (Mohan Raja) దర్శకత్వం వహించారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ (Salman Khan), నయనతార (Nayanthara), సత్యదేవ్ (Satyadev), సునీల్ (Sunil), యాంకర్ అనసూయ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.