యాప్నగరం

Chiranjeevi: గాడ్ ఫాదర్ క్లైమాక్స్ మళ్లీ షూట్ చేశాం.. ముందు అలా తీయడం నచ్చలేదు: చిరంజీవి

గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ మీట్‌ (God Father Blockbuster Success Meet)ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సినిమా అనుభవాలను మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పంచుకున్నారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 9 Oct 2022, 8:18 am
గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ మీట్‌ (God Father Blockbuster Success Meet)ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. ఈ మూవీ కోసం తన కంటే తన భార్య సురేఖా ఎక్కువ టెన్షన్ పడిందని చెప్పారు. ఆమెను చూసి తాను కూడా కాస్త భయం వేసిందన్నారు. రిలీజ్ ముందు రోజు నిద్రపోలేదని.. కొన్ని గంటల పాటు వణికిపోయానని అన్నారు. అందరూ సినిమా బ్లాక్‌బస్టర్ అని కాల్స్ చేసిన తరువాత ఎక్కడలేని ఉత్సాహం వచ్చిందన్నారు.
Samayam Telugu God Father Success Meet
గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ మీట్


ఈ సినిమా క్లైమాక్స్ గురించి చిరంజీవి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'మొత్తం షూట్ అయిపోయింది.. సత్యదేవ్‌, నయనతారలకు మీ సీన్స్ అయిపోయాయి.. మీరు వెళ్లిపోయి వేరే సినిమాలు చూసుకోవచ్చని చెప్పాం. అంతా అయిపోయిన తరువాత క్లైమాక్స్ చూస్తుంటే.. ఎక్కడో సత్యదేవ్ మీద జాలి కలుగుతోంది. మనిషి ఒక్కసారిగా డంగ్ అయిపోయాడు. అలా డల్ అయిపోయిన మనిషిని కాల్చడం నాకే నచ్చలేదు.

ఇలా కాదనుకుని.. సత్యదేవ్ క్రూరత్వం ఇంకా పెంచాలని అనుకున్నా.. అది లాస్ట్ మినిట్ వరకు ఉండాలి.. కొంచెం విలనిజం పెంచాలని రాజాకు చెప్పా. తరువాత టీమ్ కూర్చొని మళ్లీ ప్లాన్ చేసింది. లాస్ట్ మినిట్‌లో చెల్లెలును చంపేందుకు సత్యదేవ్ ప్లాన్ వేయడం.. ఆ యాక్సిడెంట్ అతను ఫెయిల్ అవ్వడం.. నేను అప్పటికే నా మనుషులను అక్కడ పెట్టడం.. నా ఫాదర్‌ను ఎలా చంపాడో విలన్‌ను కూడా అలానే చంపేలా ప్లాన్ చేసి రీషూట్ చేశాం. ఇది కూడా సినిమా రిలీజ్‌కు 15 రోజుల ముందు షూటింగ్ చేశాం.

ఈ సినిమా సక్సెస్ మొత్తం టీమ్‌కు దక్కుతుంది. టీమ్ మొత్తం రెమ్యూనరేషన్ కోసం పని చేయలేదు. సూపర్ హిట్ అవ్వాలని కసితో పనిచేశారు. ప్రతి ఒక్కరు సొంత సినిమా అని ఫీల్ పనిచేశారు. అయితే మూవీ రిలీజ్‌కు మీడియాలో వచ్చి కొన్ని వార్తలు చిరాకు తెప్పించాయి. ఎలాంటి ప్రమోషన్స్ చేయట్లేదని.. ఇంకా షూటింగ్ చేస్తున్నారట అంటూ వార్తలు రాసేశారు. మేం చేయాలో కూడా మీడియానే చెప్పడం చిరాకు అనిపించింది. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఎలాంటి విమర్శలు రాకూడదని వర్షంలో తడుస్తూ.. నేను ఒక్కడినే మాట్లాడా. వర్షంతో రసాభాసా అయిందని వార్తలు రాకూడదని మొత్తం బాధ్యత తీసుకుని మాట్లాడా. సినిమా విడుదలైన తరువాత చాలా బాగుందని అన్ని మీడియా సంస్థలు మెచ్చుకుంటున్నాయి. మీడియాకు చాలా ధన్యవాదాలు. శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.

నా జీవితంలో అత్యద్భుతమైన 15 సినిమాల్లో గాడ్ ఫాదర్ ఒకటి. ఇంత బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్. ప్రధానంగా సల్మాన్ ఖాన్‌కు థ్యాంక్స్ చెప్పాలి. ప్రొఫెషనల్‌గా ఎంత ఉన్నా.. అంతా డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఎంత అని చెప్పకుండా.. ఓ పెద్ద అమౌంట్ ముంబాయికు వెళ్లి సల్మాన్‌కు ఇవ్వాలని ప్రొడ్యూసర్స్‌కు చెప్పా. అయితే సల్మాన్ ఖాన్ తిరస్కరించారు. చరణ్‌పై, నాపై ప్రేమతో ఈ సినిమా చేశాడు..' అంటూ సినిమాలోని నటీనటులందరి గురించి చిరంజీవి చెప్పుకొచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.