యాప్నగరం

హృదయాల్ని కలిచివేసింది... విశాఖ దుర్ఘటనపై చిరంజీవి, మహేష్

విశాఖ దుర్ఘటనపై టాలీవుడ్ షాక్‌కు గురైంది. అక్కడున్న ప్రజలంతా క్షేమంగా ఉండాలని సినీ తారలంతా ట్వీట్లు చేస్తున్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.

Samayam Telugu 7 May 2020, 11:16 am
విశాఖలో విష వాయువు దుర్ఘటనపై టాలీవుడ్‌కు చెందని ప్రముఖులంతా స్పందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి దీనిపై స్పందించారు. విశాఖ లో విషవాయువు స్టెరిన్ బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నానని చిరు ట్వీట్ చేశారు. లాక్ డౌన్ తర్వాత పరిశ్రమలు తెరిచేటప్పుడు సంబంధిత అధికారులంతా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు మెగాస్టార్.
Samayam Telugu చిరంజీవి, మహేష్ బాబు


మెగాస్టార్‌కు ముందు టాలీవుడ్ ప్రముఖులు మంచు లక్ష్మీ, మంచు మనోజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి సైతం ఈ ఘటనపై స్పందించారు. విశాఖలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన తమను షాక్‌కు గురి చేసిందన్నారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని కోరుతూ వీరంతా ట్వీట్ చేశారు. తాజాగా మహేష్ కూడా ట్వీట్ చేశారు. వైజాగ్ గ్యాస్ లీక్ వార్తలు హృదయ విదారకంగా మారాయన్నారు. ప్రస్తుతం కరోనా వంటి వైరస్ విస్తరిస్తున్న సవాలు సమయాల్లో గ్యాస్ లీకేజ్ కారణంగా మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు. వాళ్లంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్థున్నాన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.