యాప్నగరం

నటించి 9ఏళ్లైనా అదే రోషం, అదే పౌరుషం

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ చిత్రంపై టాలీవుడ్‌లో రోజుకో వార్త చక్కర్లు కొట్టి సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచేస్తుంది.

TNN 6 Dec 2016, 4:54 pm
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ చిత్రంపై టాలీవుడ్‌లో రోజుకో వార్త చక్కర్లు కొట్టి సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచేస్తుంది. తాజాగా ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రీకరణ ఇంచుమించు పూర్తి కావడంతో ఆ సినిమా పై క్రేజ్ పెంచడానికి ఆ సినిమా లోని స్టిల్స్‌ను ఒకొక్కటిగా మెగా కాంపౌండ్ విడుదల చేస్తూ ‘ఖైదీ’పై అంచనాలను పెంచేస్తోంది.
Samayam Telugu megastar chiranjeevi new still from khaidi no 150
నటించి 9ఏళ్లైనా అదే రోషం, అదే పౌరుషం


ఇప్పటికే చిరు డాన్స్ చేస్తున్న స్టిల్స్‌ని విడుదల చేయడంతో మెగాస్టార్ స్టెప్పులకు ఈ సినిమాలో లోటు ఉండదని తేలిపోయింది. తాజాగా కేవలం డాన్స్ మాత్రమే కాదు యాక్సన్‌ కూడా అదే రేంజ్‌లో ఉండబోతోందని చిరంజీవి ఆవేశంగా ఫైట్ చేస్తున్న ఒక స్టిల్ ను విడుదల చేసి అభిమానుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశారు.

చిరంజీవి డాన్స్ చేసినా, ఫైట్స్ చేసినా అసలు కష్ట పడుతున్నట్టే ఉండదు. అంత సహజంగా చేస్తారు చిరు. అందుకే అతని డాన్స్ అన్నా ఫైట్స్ అన్నా ప్రేక్షకులకు అంత ఇష్ట పడతారు. సినిమాలలో తన పాత్రకు సంబంధించి ప్రదర్శించే ఆవేశంలో చాల సహజత్వం ఉంటుందనీ ఆయనతో సినిమాలు తీసిన చాలామంది దర్శకులు చెపుతూ ఉంటారు.

ఇప్పుడు కూడ చిరంజీవి తన ఆరు పదుల వయస్సులో తనలోని రోషం ఏమాత్రం తగ్గలేదు అని, దాదాపు తొమ్మిది సంవత్సరాల తరువాత నటిస్తున్నా తనలోని స్టామినా ఏమాత్రం తగ్గలేదనటానికి ఈ స్టిల్ ఒక్కటే చాలంటూ మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.