యాప్నగరం

Chiranjeevi: నా ఊపిరి.. గుండె చప్పుడు అన్ని మీరే.. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నేటికి 44 సంవత్సరాలు అయింది. ప్రాణం ఖరీదు (Pranam Khareedu) మూవీ ద్వారా ఆయన నటుడిగా తెరంగేట్రం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 22 Sep 2022, 7:46 pm
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. తెలుగు సినీ ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఈ పేరు మారుమోగుతూనే ఉంటుంది. నటనకు కొత్త భాష్యం చెబుతూ.. పాత్ర ఏదైనా తనకు తానే పోటీగా నటించే నటుడు ఆయన. కొణిదెల శివశంకర వరప్రసాద్‌గా సామాన్య కుటుంబం నుంచి వచ్చి.. టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. అయితే హీరో అవ్వకముందు సైడ్ క్యారెక్టర్లు, విలన్‌గా నటించిన విషయం సినీ ప్రపంచానికి తెలిసిందే. మెగాస్టార్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమా ప్రాణం ఖరీదు (Pranam Khareedu). ఈ మూవీ విడుదలై నేటికి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
Samayam Telugu Megastar Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి


ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 'మీకు తెలిసిన ఈ చిరంజీవి.. చిరంజీవిగా పుట్టిన రోజు.. ఈ రోజు 22 సెప్టెంబర్ 1978. ప్రాణం ఖరీదు సినిమా ద్వారా ప్రాణం పోసి.. ప్రాణపదంగా, నా ఊపిరై.. నా గుండె చప్పుడై.. అన్నీ మీరై 44 సంవత్సరాలు నన్న నడిపించారు. నన్నింతగా ఆదరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను.. ఎప్పటికీ మీ చిరంజీవి..' అంటూ ఆయన రాసుకొచ్చారు.

ఈ సినిమాలో మెడలో ఒక కాశీతాడు.. భుజాన ఒక మాసిన తువ్వాలు.. పక్కకు దువ్విన గిరజాల జుట్టుతో చిరంజీవి కనిపిస్తారు. ఇందులో నరసయ్య అనే పాత్రలో నటించి.. తొలిసినిమాతోనే అందరినీ మెప్పించారు. కె.వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. నరసయ్య పాత్రకు కొత్త కుర్రాడి కోసం వెతుకుతున్న క్రమంలో అప్పట్లో అసోసియేట్ డైరెక్టర్‌గా ఉన్న ప్రేమ్ కుమార్.. చిరంజీవి ఫొటోలు పంపించడంతో సెలక్ట్ చేశారు. ఆ తరువాత మేకప్ టెస్ట్‌ ఒకే కావడంతో మెగాస్టార్ తెరంగేట్రం జరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.