యాప్నగరం

ఇంద్రపురి రాకుమారీ ‘ఉంగరం’ జారవిడిచి మళ్లీ వస్తావ్ కదూ!!

‘ఈ మానవుని చెంత చేరి, అచ్చిక బుచ్చికలాడి, మచ్చిక చేసుకొని, నా అంగుళీయకము (ఉంగరం) సంపాదించెద’ అంటూ ఇంద్రలోకం నుండి భూమికి చేరిన అతిలోక సుందరి తిరిగి వెళ్లకుండా భూలోకంలోనే ఉండిపోతుంది.

TNN 28 Feb 2018, 4:04 pm
‘ఈ మానవుని చెంత చేరి, అచ్చిక బుచ్చికలాడి, మచ్చిక చేసుకొని, నా అంగుళీయకము (ఉంగరం) సంపాదించెద’ అంటూ ఇంద్రలోకం నుండి భూమికి చేరిన అతిలోక సుందరి తిరిగి వెళ్లకుండా భూలోకంలోనే ఉండిపోతుంది. 1990లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రం ‘జగదేక వీరుడు- అతిలోక సుందరి’ . ఈ సినిమాలో శ్రీదేవి ఇంద్రజగా ప్రేక్షకులను మెప్పించిన తీరు అజరామరం.
Samayam Telugu memory of sridevi evergreen movie jagadeka veerudu athiloka sundari
ఇంద్రపురి రాకుమారీ ‘ఉంగరం’ జారవిడిచి మళ్లీ వస్తావ్ కదూ!!


ఈ సినిమాలో స్వర్గలోకాన ఇంద్రుని పుత్రిక అయిన ఇంద్రజ (శ్రీదేవి) భూలోకాన మానససరోవరం అందంగా ఉంటుందని తెలుసుకొని తండ్రి వద్ద అనుమతి తీసుకొని అక్కడకు వస్తుంది. తిరిగి వెళ్ళే సమయంలో స్వర్గలోక ప్రవేశం గావించే ఉంగరాన్ని జారవిడుచుకొంటుంది. దానితో ఆమెకి స్వర్గలోక ద్వారాల వద్దే నిషేధం కలుగుతుంది. రాజు (చిరంజీవి) వద్ద తన ఉంగరం ఉందని తెలుసుకొన్న ఇంద్రజ... రాజు పెంచుకునే పిల్లల ద్వారా అతనికి చేరువై ఆ ఉంగరాన్ని సంపాదించే ప్రయత్నంతో నిజంగానే అతనిని ప్రేమించి, సంపాదించిన ఉంగరంతో ఇంద్రలోకం పోకుండా భూమిపైనే ఉండిపోతుంది.

ఇది సినిమా కథే అయినప్పటికీ శ్రీదేవి నిజ జీవితంలోకి అన్వయించుకుంటే.. శ్రీదేవి మరణంతో ముగ్ధమనోహర రూపం అదృష్యమైంది. తిరిగి రాని లోకాలకు చేరిందనే వార్త అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘సుమారు యాభై ఏళ్లపాటు నువ్వు స్వర్గలోకం నుంచి భూమ్మీదకు విహారానికొచ్చిన దేవకన్యవి.. ఇప్పుడు మాయమయ్యావ్... కాని నువ్ మాకోసం వస్తావ్. నీకు మళ్లీ మానసరోవరం చూడాలనే కోరిక కలుగుతుంది. అప్పుడు నువ్ ఇంద్రుడికి కూడా చెప్పకుండా కిందకి దిగిపోతామ్. మాకోసం మళ్లీ నీ ఉంగరం పడేసుకోవా శ్రీదేవీ.. అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ‘అతిలోకసుందరి’ మళ్లీ వస్తుందంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.