యాప్నగరం

ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆ హీరోల పాత్రలు!

తేజ దర్శకత్వంలో రూపొందే ఎన్టీఆర్ బయోపిక్‌ను అత్యంత గ్రాండ్ గా రూపొందించనున్నారని తెలుస్తోంది.

TNN 27 Oct 2017, 12:56 pm
తేజ దర్శకత్వంలో రూపొందే ఎన్టీఆర్ బయోపిక్‌ను అత్యంత గ్రాండ్ గా రూపొందించనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ అంటే అల్లాటప్పాగా కాకుండా..అదిరిపోయేలా తీయడానికి తగురీతిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ఇందులో భాగంగా ఈ సినిమాలో దక్షిణాది ప్రముఖ నటుల ప్రస్తావన కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఎన్టీఆర్ సమకాలికులు అయిన దక్షిణాది ప్రముఖ హీరోల పాత్రలన్నీ ఈ సినిమాలో కనిపించబోతున్నాయని సమాచారం.
Samayam Telugu mgr rajkumar in nbks ntr
ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆ హీరోల పాత్రలు!


విఖ్యాత తెలుగు నటులు ఏఎన్నార్, శోభన్ బాబు, ఎస్వీఆర్ తదితరుల పాత్రలు ఈ సినిమాలో కనిపించబోతున్నాయని సమాచారం. అలాగే, నాటికి తెలుగు చిత్ర పరిశ్రమకు కేంద్రం చెన్నై కదా.. తమిళానికి చెందిన ప్రముఖ హీరోలు కూడా ఈ సినిమాలో కపించనున్నారని తెలుస్తోంది. ఎంజీఆర్, శివాజీగణేషన్ తదితర తమిళ సూపర్ స్టార్ల ప్రస్తావన కూడా ఉండబోతోన్నారని టాక్.

ప్రస్తుతం ఈ పాత్రలకు తగిన నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నాడట దర్శకుడు తేజ. అవన్నీ ప్రముఖుల పాత్రలు కాబట్టి.. వాటిల్లో ప్రస్తుత ప్రముఖ నటులే కనిపించే అవకాశం ఉంది. దీంతో.. ఎన్టీఆర్ బయోపిక్ కన్నుల పండుగే అనమాట!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.